యూనిట్

గుంటూరు జిల్లాలో తొమ్మిదిమందికి హెడ్ కానిస్టేబుళ్ళుగా పదోన్నతి

గుంటూరు అర్బన్ లో పని చేయుచున్న తొమ్మిది మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్ళుకు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ పి. హెచ్. డి. రామకృష్ణ ఉత్తర్వులు జారీచేశారు.  పదోన్నతి పొందిన డి.శ్రీనివాస రావువి.శ్రీనివాసరావు, ఆర్ చంద్రశేఖర్ఆర్ అనంత కుమార్,, షేక్ ఆసీన్ అహ్మద్ , టి రామారావు, ఎమ్వి రామ గోపాల్పీకే శ్రీనివాస రావు, బి.హనుమంత రావు లు అర్బన్ ఎస్పీ  పి.హెచ్.డి. రామకృష్ణ ని అర్బన్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో కలసి ప్రమోషన్లు కల్పించి నందులకు వారు కృతజ్ఞతలు తెలియ జేసినారు. ఈసందర్భంగా ఎస్పీ  మాట్లాడుచూ పదోన్నతులు పొందిన వారు మరింత బాధ్యత కలిగి, నీతి నిజాయితీలతో విధులు నిర్వర్తించుచూ పోలీసుశాఖకు పేరు ప్రతిష్టలు తీసుకోని రావాలని కోరారు.

వార్తావాహిని