యూనిట్

రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు శాలరీ ప్యాకేజీ ఇన్సురెన్స్ రూ. 60 లక్షలు జమ

అనంతపురం జిల్లాలో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు శ్యాలరీ ప్యాకేజీ కింద ఇన్సురెన్స్ డబ్బు రూ. 60 లక్షలను చనిపోయిన కానిస్టేబుళ్ల భార్యల బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. 

వివరాలు... గత ఏడాది మే 29న రాప్తాడు కానిస్టేబుల్ రవిశంకర్ (పి.సి నంబర్ 2231)... గత సంవత్సరం జులై 13 న గుడిబండ కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డి (పి.సి నంబర్ 3685) లు వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. రాష్ట్ర డి.జి.పి శ్రీ దామోదర్ గౌతమ్ సవాంగ్ గారు తీసుకున్న నిర్ణయంతో బ్యాంకు వారు ఎంప్లాయస్ ప్యాకేజీ ఇన్సురెన్స్ డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో ఆ కుటుంబాలకు భారీగా ఆర్థిక చేయూత అందింది. ప్రభాకర్ రెడ్డి భార్య విజయలక్ష్మికి, రవికుమార్ భార్య నాగరత్నలకు చెరో రూ. 30 లక్షల డబ్బు బ్యాంకు ఖాతాలో జమ కావడంతో ఈ రెండు కుటుంబాలు గురువారం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబును కలిశారు. చిన్న వయస్సులోనే భర్తలను పోగొట్టుకున్న తమకు ఈ డబ్బు శాలరీ ప్యాకేజీ ఇన్సురెన్స్ కింద జమ చేయించిన రాష్ట్ర డి.జి.పి శ్రీ దామోదర్ గౌతమ్ సవాంగ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ డబ్బును వృధా చేసుకోకుండా మరియు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అడ్హక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్నాథ్, ఆర్.ఎస్.ఐ జాఫర్, సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని