యూనిట్
Flash News
పదవి విరమణ
గుంటూరు జిల్లా రేపల్లె పోలీస్‌స్టేషన్
నందు ఎ.ఎస్.ఐ.గా విధులు నిర్వహించి జనవరి 31నాడు వాలంటరీ రిటైర్‌మెంట్
అయినటువంటి ఎస్.పరిశుద్ధరావు (ఎ.ఎస్.ఐ.1704)కు భద్రత పథకం కింద
మంజూరైన రూ.56,809లు చెక్కును ఎ.ఎస్.ఐ. కుమారుడు సునీల్‌శాంత్‌కు
అందజేశారు. అలాగే ఎస్.పి. ఆఫీసులో బార్బర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.వెంకటరావు
ఫిబ్రవరి 29నాడు పదవీ విరమణ చెందారు.
ఈయనకు భద్రత కింద 56,809ల చెక్కును గుంటూరు రూరల్ జిల్లా అదనపు
ఎస్.పి. జి.రామాంజనేయులు అందజేశారు. కార్యక్రమంలో డిపిఓ స్టోర్ సూపరింటెండెంట్
బాషా పాల్గొన్నారు. విశాఖ జిల్లా చోడవరం
పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న డి.సత్యన్నారాయణ ఇటీవల అనారోగ్యంతో
చనిపోయారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు గాను
రూ. 15వేల చెక్కును, కారుణ్య నియామకం కింద సత్యన్నారాయణ
సతీమణి డి.శ్రీదేవిని హోంగార్డుగా నియమిస్తున్నట్లు ఎస్.పి. డాక్టర్ కోయ ప్రవీణ్
తెలిపారు. కార్యక్రమంలో ఆర్.ఐ. పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మొత్తం 130 మంది సిబ్బందికి దంతవైద్యం నిర్వహించారు. ఆసుపత్రి ఎండి గాదం రఘురాం
ఆధ్వర్యంలో డాక్టర్లు విఠల్, దివ్య వెన్నెల దంత
పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసుఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు అర్బన్ పరిధిలోని చిలుకలూరిపేట మండలం గణపవరం గ్రామంలో తాళ్లూరి సామియేల్ అంగవైకల్యుడు. ట్రైసైకిల్ కొనుగోలు చేయడానికి కూడా ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నాడు. పెదకాకాని పీఎస్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ మైలా సాంబశివరావు గుర్తించి సామియేల్‌కు మూడు చక్రాల సైకిల్‌ను బహుమతిగా అందజేశాడు. ఈ సందర్భంగా అర్బన్ అదనపు ఎస్.పి. భాస్కరరావు చేతులమీదుగా సైకిల్‌ను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పోలీసు అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ దళవాయి సుబ్రమణ్యం, జిల్లా అధ్యక్షుడు జె.వెంకటేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు బాలు హాజరై అభినందనలు తెలిపారు.