యూనిట్

పోలీస్ సంక్షేమం

పోలీసు కుటుంబాలకు ఆపన్న హస్తం

గుంటూరు రూరల్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను ఆదుకునేందుకు జిల్లాలోని ప్రతి పోలీసు నుంచి రూ.100ల ప్రకారం వసూలు చేసి బాధిత నాలుగు పోలీసు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కును గుంటూరు రూరల్‌ ఎస్‌.పి. కె.నారాయణనాయక్‌, అదనపు ఎస్‌.పి. జి.రామాంజనేయులు సమక్షంలో పోలీసు కుటుంబాలను అందజేయడం జరిగింది. 

1. డయల్‌ 100లో విధులు నిర్వహిస్తు గుండెపోటుతో  కె.హరిబాబు (పి.సి. 530) మృతి చెందారు. 

ఆయన సతీమణి శ్రీమతి కె.రమాదేవికి లక్ష రూపాయల చెక్‌ అందజేశారు. 2.  గుంటూరు రూరల్‌ జిల్లాలో పనిచేసే డి. పెద శ్రీనివాసరావు (పిసి-3378) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 

ఆయన సతీమణి శ్రీమతి డి.ప్రమీలకు చెక్‌ అందజేశారు.  3. నకేరికల్లు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న డి. దుర్గా మల్లేశ్వరరావు (పి.సి. 2003) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన సతీమణి శ్రీమతి జి. మేరీ రత్నకు ఆర్థిక సాయం చేశారు. 4. బొల్లపల్లి పీఎస్‌లో పనిచేస్తున్న బెన్‌హర్‌ బాబు (హెచ్‌.సి. 1937) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన సతీమణి శ్రీమతి  బి. సారమ్మకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షుడు చందు పూర్ణ చంద్రరావు, ఎం.వి.కె.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

వార్తావాహిని