యూనిట్

అనారోగ్యాలతో మరణించిన పోలీసు కుటుంబాలకు ఆర్థిక సహాయం

పనిభారం, మానసిక ఒత్తిళ్ళు అనారోగ్యానికి దారులు. పోలీసు వృత్తిలో ఇవి తప్పనిసరి. ఇటీవల అనారోగ్యంతో ఎ.ఆర్‌.కానిస్టేబుల్‌   ఎం. ప్రవీణ్‌రాజు మృతి చెందాడు. ప్రవీణ్‌రాజు కుటుంబానికి అండగా పోలీసు వితరణ నిధి నుండి 2 లక్షల చెక్కును ఆయన సతీమణి శ్రీమతి వనితకు అందజేశారు. మరో ఎ.ఆర్‌.కానిస్టేబుల్‌   బి.ఎల్‌. నరసింహులు, రాయచోటి పిఎస్‌ కానిస్టేబుల్‌   ఎ.మహేశ్‌ కుమార్‌, మరో ఏ ఆర్‌ కానిస్టేబుల్‌   వై. జగదీశ్వర్‌ ఇలా మరో ముగ్గురు కూడా పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. వీరందరి కుటుంబ సభ్యులకు కూడా జిల్లా ఎస్‌.పి. డా|| నవీన్‌ గులాఠి, జిల్లా అడిషనల్‌ ఎస్‌.పి.  విజయ్‌కుమార్‌ల చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. 

వార్తావాహిని