యూనిట్

కుటుంబాన్ని ఆదుకున్న ''కొలీగ్స్‌''

వేసవికాలం మొదలయ్యిందంటే చాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా భానుడి ప్రతాపానికి ఎందరో బలవుతుంటారు. ట్రాఫిక్‌ను సమన్వయపరుస్తూ వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్‌ నియంత్రిస్తున్న ఓ హోంగార్డు కోసరాజు లీలారావ్‌ వడదెబ్బ తగిలి మృతిచెందాడు. విధి నిర్వహణలో మృతిచెందిన లీలారావ్‌ కుటుంబానికి ట్రాఫిక్‌ పోలీసు అధికారులు, సిబ్బంది చేయిచేయి కలిపి తమవంతు సాయంగా రూ.1,00,000/-ల ఆర్థిక సాయాన్ని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ ఎ.బి. వెంకటేశ్వరరావు చేతులమీదుగా మృతుని సతీమణికి అందించారు. 

వార్తావాహిని