యూనిట్

రిలీఫ్‌ అండ్‌ రీఫ్రెష్‌ పోలీసుకు అవసరం

16వ పటాలములో సిబ్బందికి రిలీఫ్‌ అండ్‌ రీఫ్రెష్‌ కోర్సును కమాండెంట్‌ వి.జగదీష్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ సిబ్బంది నిత్యం విధి నిర్వహణలో తీరికలేని సమయాన్ని గడుపుతూ ఎన్నో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని అలాంటి సమయంలో రిలీఫ్‌ అండ్‌ రీఫ్రెష్‌ అవసరమని అన్నారు.

వీటితో విధినిర్వహణలో గడిపే తీరికలేని సమయాన్ని ఇలా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని దీనిని దైనందిన జీవితంలో పాటించడం వల్ల అనేక సమస్యలను సులువుగా పరిష్కరించుకోని ఆనందమయంగా జీవితాన్ని సాగించవచ్చని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ పి.శామ్యూల్‌జాన్‌అసిస్టెంట్‌ కమాండెంట్లు జి.అమృతరావుజి.వి.ప్రభాకర్‌లోకనాథబాబుఆర్‌.ఐ.లు కె.తులసిరావుడిడబ్యూవో కె.సమర్పణరావు ఇతర అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని