యూనిట్
Flash News
ఎస్‌సిటిపిసి శిక్షణను ప్రారంభించిన ఐజిపి
3వ పటాలములో ఎస్‌సిటిపిసి కానిస్టేబుళ్ళ 9 నెలల శిక్షణను పటాలముల ఐజిపి
బి.శ్రీనివాసులు ప్రారంభించారు. నూతనంగా కానిస్టేబుళ్ళుగా ఎంపికైన వారిలో 127 మంది అభ్యర్థులు పటాలములో శిక్షణ
పొందుతారని, శిక్షణలో వారికి అన్నిరకాల అధునాతన
వసతులను, ఎంతో అనుభవం కలిగిన ట్రైనర్‌లచే శిక్షణ
జరుగుతుందన్నారు. శాంతిభద్రతల విషయంలో సివిల్ పోలీసులకు సహాయంగా ఉండాలని, ముందు మీ నడవడిక మంచిగా ఉండాలని, ఎప్పుడు క్రమశిక్షణతో మెలిగి, నైతిక విలువలను కలిగి ఉండాలన్నారు.
నీతి నిజాయితీగల వ్యవస్థను ఏర్పాటు
చేయడంలో పోలీసు బాధ్యత ఎంతైనా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్.పి. అద్నాన్
నయీం అస్మి మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రతీ విషయాన్ని నిశితంగా పరిశీలించి
చక్కని శిక్షణ పొందాలని తెలిపారు.
తల్లిదండ్రుల పట్ల గౌరవంగా మెలిగి, జీవిత భాగస్వామి దగ్గర నమ్మకంగా ఉండాలని
సూచించారు. అనంతరం ఇండక్షన్ ట్రైనింగ్ మెటీరియల్ బుక్‌లెట్‌ను ప్రారంభించారు.
శిక్షణార్దులు ఉండే ట్రైనింగ్ సెంటర్ను, బేరక్స్ను ఐజిపి
సందర్శించి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో కమాండెంట్ బి.శ్రీరామమూర్తి, అడిషనల్ కమాండెంట్ ఎం.నాగేంద్రకుమార్, అసిస్టెంట్ కమాండెంట్
ఎం.బి.వి.వి.సత్యనారాయణ, యూనిట్ ఆస్పత్రి
డాక్టర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.