యూనిట్

11వ పటాలములో క్రిస్మస్‌ వేడుకలు

11వ పటాలము ఆవరణలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీసు కుటుంబ సభ్యులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చిన్నారులు, పెద్దలకు సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

కమాండెంట్‌ సతీమణి శ్రీమతి ఎన్‌.భాగ్యలత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జడ్జిగా ఎన్‌.రాజశేఖర్‌ వ్యవహరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అందరూ ప్రార్థనలు చేశారు. క్రీస్తు శాంతిసందేశాన్ని ఫాదర్‌లు అందించారు. కేక్‌కట్‌ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పి.శౌకత్‌ అలి, ఆర్‌.ఐ.లు డి.వి.రమణ, కె.పోగుదాస్‌, జి.ఎం.సాహెబ్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని