యూనిట్

వైభవంగా బాలల దినోత్సవం

3వ పటాలములో బాలల దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులచే ఏర్పాటు చేసిన సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ గ్యాలరీని కమాండెంట్‌ శ్రీ బి.శ్రీరామమూర్తి సందర్శించి విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నారు. విద్యార్థుల సాంప్రదాయ వస్త్రధారణకు కమాండెంట్‌ ముగ్దులయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను అందరిని అభినందించి, మున్ముందు మంచి ప్రతిభా పాటవాలను ప్రదర్శించాలని సూచించారు.

కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ ఎం.నాగేంద్రరావు, పాఠశాల ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, అసిస్టెంట్‌ కమాండెంట్లు ఎస్‌.దేవానందరావు, జి.లక్ష్మినారాయణ, ఆర్‌.ఐ.లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వార్తావాహిని