యూనిట్

నెల్లూరు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 'ఆపరేషన్‌ ముస్కాన్‌'

నెల్లూరు:  నెల్లూరు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 'ఆపరేషన్‌ ముస్కాన్‌' నిర్వహించారు. జిల్లా ఎస్‌.పి. ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు జిల్లాలోని డివిజన్‌ల పోలీసు అధికారులు ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 158 మంది చిన్నారులను గుర్తించారు. క్వారీలు, ఇటుకల బట్టీలు, హోటళ్ళు, డాబాలు, ప్లాట్‌ఫారాల మీద ఉండే 14 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి చేరదీయడం జరిగిందని జిల్లా ఎస్‌.పి. ఐశ్వర్య రస్తోగి తెలిపారు. చిన్నారుల వివరాలు తెలుసుకుని 136 మందిని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు తెలిపారు. మిగతా 36 మందిని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌, సిడబ్ల్యూసీ, లేబర్‌ కమిషన్ల సమక్షంలో సంరక్షణ కేంద్రాల్లో చేర్చడం జరిగిందని ఎస్‌.పి. తెలిపారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో డిఎస్‌పి జె.శ్రీనివాసులు, టౌన్‌ అధికారులు, జిల్లా చైల్డ్‌ వెల్పేర్‌ కమిటీ చైర్మన్‌ శ్రీమతి సురేఖ, జేజేబీ సభ్యులు జగదీశ్వర్‌, అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని