యూనిట్

ఆపరేషన్ ముస్కాన్ ను విజయవంతంగా నిర్వహించిన నెల్లూరు జిల్లా పోలీసులు

ఆంధ్ర రాష్ట్ర డి.జి.పి. ఆఫీసు వారి ఉత్తర్వులు మేరకు జిల్లా యస్.పి.  భాస్కర్ భూషణ్,  నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్ స్టేషన్ పరిధిలలో  “ఆపరేషన్ ముస్కాన్” నిర్వహించాలని  ఆదేశించారు.  ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా  టౌన్ మరియు రూరల్ సబ్ డివిజన్ పరిధిలో రిస్క్వు చేసిన బాలలు మరియు వారి తల్లిదండ్రులతో   ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి అయన  మాట్లాడుతూ “మన పిల్లలే మన భవిష్యత్” అని వారి చదువు, వసతి, ఆహారం, కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు అందిస్తున్నదన్నారు.  వారిని ఎట్టి పరిస్థితులలో పనులకు పంపి బాలకార్మికులుగా మార్చవద్దు అని, బాలల కుటుంబాలకు ఎలాంటి సమస్యలు ఉన్న అన్నీ విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.  ఈ రోజు జరిగిన ఆపరేషన్ ముస్కాన్ లో పోషించిన మహిళా పోలీస్ అధికారుల(గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు) సహకారంతో 373 మంది బాలలు మరియు 32 మంది బాలికలను మొత్తం 450 మందిని రిస్క్యూ చేయడం జరిగిందని తెలిపారు.  

వార్తావాహిని