యూనిట్

పోలీసు సాంకేతిక విప్లవం 'ఇ-లెర్నింగ్‌'

మాజంలో ఎదురయ్యే సమస్యలను సానుకూలంగా పరిష్కరించే విధంగా పోలీసులు తమ ప్రతిభను చాటాలి. అలాకాక ప్రతి విషయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. నానాటికి పెరిగిపోతున్న ఆధునిక సాంకేతిక పోకడలను అర్థం చేసుకోవాలంటే పోలీసులకు తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగైనా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సిబ్బందికి -లెర్నింగ్ విధానం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, మున్ముందు శాంతిభద్రతల్లో తీసుకోవాల్సిన చర్యలపై టెక్నాలజీ పరంగా చెబితే అర్థమవుతుందని భావించి, 2017 మార్చిన అదనపు డిజిపి పి.వి. సునీల్ కుమార్‌, ఇన్నోయెల్ సంస్థ వ్యవస్థాపకులు కిషన్ చందర్ ఆధ్వర్యంలో '-లెర్నింగ్‌' విద్యా విధానం ప్రారంభమైనది. సాఫ్ట్వేర్ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా గుంటూరులో ప్రారంభించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 10 -లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించారు. వీటిలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన, వాటిని ఎలా పరిష్కరించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో రూపంలో వివరించారు. అలాగే ఇటీవల ఎక్కువగా జరుగుతున్న బాలలపై హింస వీటి పరిశోధనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నారులు పోలీసులంటే భయపడకుండా చేయాల్సిన పనులేంటి వంటి వాటిపై  వివరించడం జరిగింది. గిరిజనులు, ఆదివాసీల పట్ల అవగాహన, ఇండియన్ పీనల్ కోడ్పై చాలా మంది పోలీసు సిబ్బందికి తెలియదు వీటిపై సీనియర్ జ్యుడీషియల్ మేధావులతో వీడియోల రూపంలో తర్ఫీదు ఇవ్వడం జరిగింది. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ వంటివాటిపై, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దర్యాప్తులో ముఖ్యమైన అంశాలు తెలుపడం జరిగింది. చివరికి చాలా మంది

ఉన్నతవిద్యను అభ్యసించినా ఆంగ్లంలో మాట్లాడటం రాదు, అందుకు వారికి గ్లామర్లో తప్పులు, రాయడంలో ప్రతిభను చూపేలా నేర్పడం జరిగింది. వీటిలో పిటిసి అనంతపురం, పిటిసి తిరుపతి, పిటిసి ఒంగోలు, పిటిసి విజయనగరం, డిటిసి ఏలూరు, డిటిసి రాజమహేంద్రవరం, డిటిసి కర్నూలు, డిటిసి విశాఖ పట్నం, సిటిసి విజయవాడ, డిటిసి గుంటూరులుగా ఎంపిక చేసి ఆయా సెంటర్లలో ఇన్నోయెల్ సంస్థ నుంచి వచ్చిన ప్రతినిధులు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు -లెర్నింగ్ సెంటర్లలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకు పైగా సిబ్బంది '-లెర్నింగ్‌'లో శిక్షణ తీసుకున్నారు. భారతదేశంలో టెక్నాలజీ సహాయంతో పోలీసులకు పాఠాలను బోధిస్తున్న మొట్టమొదటి శాఖ మనది. ప్రభుత్వరంగ సంస్థగా, ఇంత విస్తృతంగా రాష్ట్ర పోలీసు విభాగాలన్నింటికీ అధునాతన సాంకేతికత సహాయంతో పేరెన్నికగన్న ప్రముఖ వ్యక్తులచే పాఠాలనందిస్తూ కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేషన్ అందిస్తున్న ఏకైక ప్రాజెక్ట్ మన శాఖకు చెందిన -లెర్నింగ్ కావడం విశేషం. వీరిని 'సురక్ష' పలుకరించగా -లెర్నింగ్ విధానం చాలా బాగుంది. ఇన్నిరోజులు మూస పద్ధతిలో ఉన్న మాకు చట్టాల గురించి పాఠ్యాంశాలుగా, ఎలక్ట్రానిక్ వీడియో రూపంలో రూపొందించడం ఆనందంగా ఉంది. అంతేగాకుండా ఇంకా సెల్ఫోన్ యాప్ రూపంలో తీసుకొస్తే మరింత బాగుంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

వార్తావాహిని