యూనిట్

నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

నకిలీ నోట్లు-పరీక్షలు-చట్టాలు

7. సూక్ష్మ అక్షరాల ముద్రణ: వీటిని భూతద్ధం సహాయంతో మాత్రమే చూడగలము. అన్ని నోట్లలో గాంధీబొమ్మ పక్కనే ఆర్‌బిఐ అనే అక్షరాలు ప్రక్కనే డినామినేషన్‌ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడున్న కొత్త రూ.500లు, రూ.2000లు నోట్లలో గాంధీగారి కళ్ళజోడు ఫ్రేముకు ఆర్‌బిఐ అని, అలాగే ప్రక్కనే ఆర్‌బిఐ 2000 ఇండియా అని, రూ.500లలోని ఎర్రకోట పట్టీకి భారత్‌, ఇండియా అని సూక్ష్మ అక్షరాల వరుస ముద్రించబడి ఉంటుంది. నోటు గణాంక విలువను వివిధ పద్ధతులలో నోటుపై ముద్రించి ఉంటారు.

8.         ఈ నోట్లపై ముద్రించిన వివిధ ఆకారాలు, డిజైన్లతో కూడిన గీతలు నోట్ల తయారీలో కాపీ చేయడానికి రావు. ఈ యాంటి కాపీయింగ్‌ గీతలను ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ మరియు హార్డ్‌వేర్‌ ఉపయోగించి ముద్రించడం వల్ల ఎవరూ దాన్ని యంత్రాలతో కాపీ చేయలేరు.

9. వాటర్‌ మార్కులు: నోట్లను లైటు కాంతికి ఎదురుగా పెట్టి చూస్తే మహాత్మాగాంధీ, డినామినేషన్‌ అక్షరాలు, అంకెలను సూచిస్తున్న ఎలక్ట్రోలైట్‌ గుర్తులు మరింత ప్రస్పుటంగా కనిపిస్తాయి. వీటిని నోటు తయారీ సమయంలో వాటర్‌ కోడ్‌ మెటల్‌ స్టాంపు ఉపయోగించి ముద్రిస్తారు. దీనిని ఇతర మార్గాలలో ముద్రించడం లేక నకలు చేయుట వీలుపడదు.

10. సీత్రూ రిజిస్టర్‌: ముందు భాగంలోసగం వెనుక భాగంలో సగం  ఉండే విధంగా నోట్ల గణాంక విలువ ముద్రించి ఉంటుంది. ఇలా ఉండటంవల్ల లైటుకు ఎదురుగా పెట్టి చూసినపుడు రెండువైపులా ఉన్న అంకె, వ్యత్యాసం లేకుండా ఒక్కటిలాగే కనిపిస్తుంది.

11. ఆప్టికల్లీ వేరియబుల్‌ ఇంకు: కొత్త రూ.500 మరియు రూ.2000ల నోట్లలో 500 మరియు 2000 అంకెలను కంటికి రెండు రకాల రంగులతో కనిపించే ఈ సిరాతో ముద్రించారు. నోటును సమతలంగా పెట్టి చూసినప్పుడు అవి ఆకుపచ్చగా కనిపిస్తుంది. అదే అంకెను మరో కోణంలో చూసినప్పుడు నీలంరంగులో కనిపిస్తుంది. దీనిని మైక్రోస్కోపు క్రింద చూసినప్పుడు ఉబ్బెత్తుగా ఉన్న బహుభుజ పాలిగాన్‌ల వలె కనిపిస్తాయి. దీనిని ఫోరెన్సిక్‌ నిపుణులు కనిపెడతారు.

12. ప్రతి నోటు మీద ఆ నోటు విలువను 17 భాషలలో ముద్రించి ఉంటుంది. ఇంగ్లీష్‌, హిందీలో నోటు ముందు వెనుక భాగంలో ముద్రించి ఉంటుంది.

13. భారత దేశంలోని వివిధ మింట్‌లలో తయారైన నాణేలకు వివిధ గుర్తులు ఉంటాయి. బొంబాయి మింట్‌లో తయారు చేసిన నాణేలకు డైమండ్‌ గుర్తును సంవత్సరం క్రింద ముద్రించి ఉంటుంది. కోల్‌కత్తా మింట్‌లో తయారయిన నాణేలకు సంవత్సరం క్రింద గుర్తు ఉండదు. హైదరాబాద్‌ మింట్‌లో తయారయిన నాణేలకు సంవత్సరం క్రింద స్టారు గుర్తు ఉంటుంది. నోయిడా మింట్‌లో తయారయిన నాణేలకు సంవత్సరం క్రింద ఒక చుక్క గుర్తు ఉంటుంది.

14. మనం రూపాయలను RS  లేదా INR  అను సూచించే వాళ్ళం కాని, 15 జులై 2010లో రూపీని 'తీ' గుర్తుతో సూచించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఐఐటి పోస్టుగ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ డి. ఉదయ్‌కుమార్‌ ఈ గుర్తును సూచించాడు.

15. చూపులేనివారు లేదా చూపు మందగించిన వారు నోటు యొక్క గణాంక విలువను తెలుసుకునేందుకు వీలుగా ఉబ్బెత్తుగా ముద్రించిన గుర్తు ఉంటుంది. నిలువు దీర్ఘ చతురస్రకారం, చతురస్రం, త్రికోణం, వృత్తం, సమాంతర దీర్ఘచతురస్రం గుర్తులను 20,50,100,500 మరియు 2000ల రూపాయల మీద ముద్రించి ఉంటుంది. ప్రపంచంలోని నోట్లు అన్నింటికి చూపులేనివారు గుర్తించేందుకు వీలుగా గుర్తులు వుంటాయి.

నకిలీ నోట్లు-చట్టాలు

నకిలీ నోట్లను తయారు చేయడం, ఆ నేరంలో భాగస్వామి కావటం, నకిలీ నోట్లతో లావాదేవీలు జరపడం, నకిలీ నోట్లను కలిగి ఉండటం, నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే సామగ్రిని కలిగి ఉండటం, నకిలీ నోట్లు చలామణి చేయటం వంటి నేరాలు IPC 489 , 489 బి, 489 సి, 489 డి మరియు 489 ఈ సెక్షన్ల క్రిందకు వస్తాయి. వారిమీద uppa act (అన్‌ లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్సన్‌ యాక్టు) 2008 ప్రకారం కేసు నమోదు చేయవచ్చు. ఈ నేరాలు రుజువైతే జరిమానా లేదా 2 సంవత్సరముల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష మరియు జరిమానా ఉంటుంది. ఈ సెక్షన్ల కొరకు భారతీయ శిక్షాస్మృతిలోని (1860) 18వ చాప్టర్‌లో కరెన్సీనోట్లు, బ్యాంకు నోట్లకు సంబంధించిన నేరాల గురించి వివరించారు.

వార్తావాహిని