యూనిట్

నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

గత సంచికలో  ఏయే నేరాలలో మనకు పెయింట్‌ భౌతిక సాక్ష్యాధారాలుగా లభిస్తుంది?  పెయింట్‌ అంటే ఏమిటిఅవి ఎన్నిరకాలుగా మనకు లభ్యమవుతున్నాయిదానిలో ఏయే రసాయనాలు కలిసి ఉంటాయివీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు నేరస్థలంలోనేరస్థునిపైఅనుమానిత వాహనంపైబాధితునిపై లేదా పరికరాలపై లభించినపుడు దర్యాప్తు అధికారి వీటిని ఏవిధంగా సేకరించాలి అన్న విషయాలే కాక వీటిపై ఫోరెన్సిక్‌ భౌతిక శాస్త్ర విభాగంలో ఎటువంటి శాస్త్రీయ పర్షీలు నిర్వహిస్తారు అన్న విషయాలను చర్చిచాం. ఈ సంచికలో మరికొన్ని శాస్త్రీయ పరీక్షల గురించివాటిద్వారా ఏ విషయాలు తెలుసుకుంటారుఅన్నదే నేరస్థంలో లభ్యమయే వివిధ రూపల్లో ఉన్న పెయింట్‌కు సంబంధించిన భౌతిక సాక్ష్యాధారాలను వివిధ పరికరాల సహయంతో జాగ్రత్తగా ఏలా సేకరించిభద్ర పర్చాలి?. వాటిని ఫోరెన్సిక్‌ భౌతిక శాస్త్ర విభాగానికి ఎలా రావాణా చేయాలిమొదలైన విషయాలను చర్చిద్దాం.

గత సంచికలో వివరించిన నాలుగు పద్ధతులే కాక నేరస్థలంలో లభించిన పెయింట్‌ ముక్కలకునేర వాహనం నుంచి సేకరించిన కంట్రోల్‌ శాంపిళ్ళకు నిపుణులు సాంద్రత పరీక్షలుఎమిషన్స్‌ స్పెక్ట్రోగ్రఫీ ద్వారా మూలకాల విశ్లేషణ మరియు ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోగ్రఫీ పరీక్షలే కాక ఇతర శాస్త్రీయ పరికరాలైన లేజర్‌ ఇండ్యూస్డు బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోపీ (కూIదీూ)స్కానింగ్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ - ఎనర్జీ డిస్పర్సివ్‌ ఎక్స్‌రే లను

ఉపయోగించి మూలకాల విశ్లేషణ పరీక్షలు నిర్వహించి దర్యాప్తుకు తోడ్పడుతారు.

5. సాంద్రత : గత సంచికలలో నేరస్థలంలో దొరికిన గాజుమట్టి మొదలైన వాటికి డెన్సిటీ గ్రేడియంట్‌ విధానంలో ఎలా సాంద్రత పర్షీలు నిర్వహించామో ఆవిధంగానే ఈ పెయింట్‌ శాంపిళ్ళకు కూడా నిర్వహిస్తారు.

6. ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోగ్రఫీ : పెయింట్‌లోని వర్ణ ద్రవ్యాన్నిబైండర్లనిఇతర సంకలిత పదార్ధాలను కనుగొనడానికి ఈ పద్ధతి చాలా అనువైనది.

7. లేజర్‌ ఇండ్యూస్డు బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోపీ : ఈ పద్ధతిలో లేజర్‌ కిరణాలను శాంపిల్‌ మీద ప్రయోగించి తద్వారా అది ఇచ్చిన సంకేతాలను సెక్ట్రోగ్రఫీ రూపంలో పొందుపరుస్తుంది.

8. స్కానింగ్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ - ఎనర్జీ డిస్పర్సివ్‌ ఎక్స్‌రే : ఈ పద్ధతిలో స్కానింగ్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ ద్వారా స్మూక్షమైన పెయింట్‌ శాంపిల్స్‌ను చాలా పెద్దవిగా చూడగలగటం వల్ల దానిలో ఉన్న పెయింట్‌ పొరలనుచూడటమే కాకుండా ఈ పరికరానికి అనుసంధానమై ఉన్న ఎనర్జీ డిస్పర్సివ్‌ ఎక్స్‌రే పరికరం ద్వారా ఎలక్ట్రాన్‌ కాంతి పుంజాన్ని శాంపిల్స్‌ మీద కేంద్రీ కరించినప్పుడు తద్వారా అవి వెలువరించిన ఎక్స్‌రే కిరణాలు మరియు సంకేతాలువెనుకకు తిరిగి వచ్చిన ఎలక్ట్రాన్‌లను బట్టి ఆ పెయింట్‌లో వున్న మూలకాలను గుర్తించి గ్రాప్‌ రూపంలో వెలువరిస్తుంది.

పెయింట్‌ శాంపుళ్ళ సేకరణ మరియు రవాణాకు ఉపయోగించు సామగ్రి : 

నేరస్థలంలో దొరికే విలువైన ఈ పెయింట్‌కు సంబంధించిన భౌతిక

సాక్ష్యాధారాలను సేకరించడానికి ఈ క్రింది సామగ్రి చాలా అవసరం. 

పెయింట్‌ శాంపుళ్ళ సేకరణ మరియు రవాణాలో జాగ్రత్తలు :

1. వాహనం ఢీకొని పారిపోయిన కేసుల్లో వాహనాల మీద పరస్పరం అంటుకున్న పెయింట్‌ మరకలను ఫోటోగ్రఫీ ద్వారా రికార్డు చేసుకుని  ఒక శుభ్రమైన  పదునైన బ్లేడుతో లేదా కత్తితో జాగ్రత్తగా పేపర్లోకి గీకి పొట్లం కట్టి ఒక చిన్న ప్లాస్టిక్‌ డబ్బాలో గానికవర్లలో గాని పెట్టి జాగ్రత్తపరచవలెను.

2. కంట్రోల్‌ శాంపిల్స్‌ సేకరణలో పెయింట్‌కు సంబంధించిన అన్ని  పొరలు వచ్చేల సేకరించాలి.

3. కంట్రోల్‌ పెయింట్‌ సేకరించేటప్పుడు అడుగు పొరవరకు పదునైన బ్లేడుతోకత్తితో గానీ జాగ్రత్తగా కోసి పెచ్చు అడుగు నుంచి పొరను లేపి సేకరించాలి. అలా రానపుడు వెనుకవైపు నుంచి సుత్తితో కొంచెం అదరగొడితే అది ఊడి వస్తుంది.

4. నేర ప్రదేశంలోదుస్తులపైరోడ్డుపై పడిఉన్న పెయింట్‌ పొరల ముక్కలను జాగ్రత్తగా సేకరించి ఒక పేపర్‌ కవర్‌లో పొట్లం కట్టి లేదా ఒక చిన్న మెటల్‌ (లోహపు) లేదా  అట్టడబ్బాలో ఆ ముక్కలు విరిగిపోకుండా అతి జాగ్రత్తగా ప్యాక్‌ చేయాలి.

5. వస్త్రాలుపనిముట్లుమొదలైన వాటికి సూక్ష్మమైన పెయింట్‌ ముక్కలు లేదా పొడి అంటుకొని ఉన్నపుడు ఆ పెయింట్‌ ముక్కలను వాటి నుంచి వేరు చేయకుండా ఆయా వస్త్రాలనుపనిముట్లను యధాతధంగా నిపుణులకు పేపర్‌ కవర్లలో పెట్టి పంపాలి. ప్యాక్‌ చేసేముందు అవి తడిగా ఉన్నట్లయితే వాటిని ఆ పేపర్‌ మీదనే ఆరబెట్టి అదే పేపర్‌లో చుట్టి పేపర్‌ కవర్లో పెట్టి ప్యాక్‌ చేసి పంపించాలి.

6. ప్యాకింగుకు ప్లాస్టిక్‌ కవర్లను మరియు  ప్లాస్టిక్‌ బాక్సులను వాడరాదు. ఎందువలన అంటే వాటిద్వారా ఉత్పత్తి అయ్యే స్థిర విద్యుత్‌ వల్ల పెయింట్‌ పొడి లేదా ముక్కలు వాటికి అంటుకు పోయి తీయడం కష్టతరమవుతుంది. కానీ వాటిని పేపర్‌లో సేకరించి పొట్లం కట్టిన తరువాత దానిని ప్లాస్టిక్‌ కవర్‌ లేదా ప్లాస్టిక్‌ బాక్స్‌లో ఉంచవచ్చు.

7. నేరస్థలంలో లేదా అనుమానిత వాహనంపై సేకరించిన సాంపుల్స్‌ను పేపర్లో చుట్టి గాజు లేదా లోహం లేదా అగ్గిపెట్టె సైజు వున్న అట్ట బాక్సులు వంటివాటిని ఉపయోగించి జాగ్రత్తగా ప్యాక్‌ చేయాలి.

8. పెయింట్‌ ఉపరితలాలపై టూల్‌ మార్కులు ఉన్నప్పుడు ఆ ఉపరితలాన్ని స్కేలు వుంచి మరియు స్కేలు లేకుండా ఫొటోగ్రఫీ ద్వారా రికార్డు చేసుకోవడమే కాక ఆ టూల్‌ మార్కుల పక్కనే ఉన్న ఉపరితలం మీది పెయింట్‌ను కంట్రోల్‌ శాంపుల్‌గా సేకరించాలి.

9. పెయింట్‌ అంటుకొని వున్న పనిముట్లను (టూల్స్‌) వాటి పెయింట్‌ ఊడిపోకుండా పనిముట్ల చివరన చిన్న పేపర్‌ను చుట్టి  లేదా పేపర్‌ కవర్‌ను తొడిగిదారంతో గట్టిగా కట్టాలి. తరువాత వాటిని పేపర్‌ కవర్లలో లేదా గుడ్డ సంచులలో విడివిడిగా ప్యాక్‌ చేయాలి.

10. నేరస్థలంలో దొరికిన టూల్స్‌ను నేరస్థలంలో ఉన్న టూల్‌ మార్కుల మీద ఉంచి పోల్చిచూసి పరీక్షించడం వంటివి చేయరాదు.

11. పెయింట్‌ ఉపరితలాలను రాసుకుంటూ పోయిన బుల్లెట్లు (రికోషెట్‌) లేదా దిగబడిన బుల్లెట్లను సేకరించి వాటిని పెయింట్‌ మరకలు ఊడిపోకుండా పేపర్లలో చుట్టి చిన్నచిన్న అట్ట డబ్బాల్లో ఉంచి ప్యాక్‌ చేయవచ్చు. ఆ మార్కుల పక్కనే ఉన్న పెయింట్‌ను కంట్రోల్‌ శాంపుల్‌గా సేకరించాలి.

12. శాంపిల్స్‌ ఎక్కడి నుంచి సేకరించారుఅది క్రైం శాంపిలాలేక కంట్రోల్‌ శాంపిలాఅన్న విషయాన్ని కవరు మీద స్పష్టంగా రాసి వాటిని విడివిడిగా ప్యాక్‌ చేయ్యాలి.

13. ప్రతి కవరు మీద క్రైం నెంబర్‌సెక్షన్‌పోలీస్‌ స్టేషన్‌తేదిపంచుల చేవ్రాలుదర్యాప్తు అధికారి చేవ్రాలు మొదలైన విషయాలు పొందుపరచాలి.

వార్తావాహిని