యూనిట్

భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

గత సంచికలో భౌతిక శాస్త్ర విభాగంలో పరీక్షించే భౌతిక సాక్ష్యాధారాలేమిటి? వాటిలో మట్టి, దుమ్ము, ధూళి, బురద తదితర భౌతిక సాక్ష్యాధారాలకు ఏయే పరీక్షలు నిర్వహిస్తారు? వీటి సేకరణ, రవాణా గురించి చర్చించాం. ఈ సంచికలో ఈ ఆధారాలకు జ్వలన పరీక్షలు, మట్టి రేణువుల సాంద్రత పరీక్షలు, ఫోరోసెన్స్‌ పరీక్షలు, స్పెక్ట్రోగ్రాఫిక్‌ అనాలసిస్‌, ఎక్స్‌రే డిఫ్రాక్షన్‌ పరీక్షలు, ఆమ్ల, క్షార పరీక్షలు మొదలగునవి ఎలా నిర్వహిస్తారు? వాటివల్ల ఏయే విషయాలు తెలుసుకోవచ్చు? వాటివల్ల దర్యాప్తు అధికారికి ఉపయోగం ఏమిటి? మొదలైన విషయాలను తెలుసుకోవడమే కాక, మట్టి, దుమ్ము మరియు ధూళి సేకరణ మరియు రవాణాలో ఎటువంటి పరికరాలను, సామగ్రిని ఉపయోగించుకోవచ్చు, ఈ భౌతిక సాక్ష్యాధారాల సేకరణ మరియు రవాణాలో దర్యాప్తు అధికారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి విపులంగా  తెలుసుకుందాం.

3. జ్వలన పరీక్షలు/డిఫరెన్షియల్‌ థర్మల్‌ అనాలసిస్‌ : మట్టి నమూనాలను 800 నుండి 900 డిగ్రీల  సెంటిగ్రేడుల వరకు వేడిచేసినపుడు ఎంత నమూనా బూడిదగా  మారిపోయింది అన్న విషయాన్ని గమనించడమే కాక, దాని రంగు మరియు ఇతర భౌతిక లక్షణాలను పరిశీలిస్తారు.

4. మట్టి రేణువుల సాంద్రత పరీక్షలు : 

వివిధ మట్టి రేణువుల సాంద్రతను పోల్చడానికి ఉపయోగించే ఈ పద్ధతిని 'డెన్సిటీ గ్రేడియెంట్‌ అనాలసిస్‌' అని అంటారు. ఇందుకు వివిధ సాంద్రతలు గల ఒకదానితో ఒకటి కలవని వేరువేరు ద్రవాలను ఒక సన్నని గాజు గొట్టంలో పోస్తారు. అడుగున ఎక్కువ సాంద్రత గల ద్రవం, అన్నింటి కంటే పైన తక్కువ సాంద్రత గల ద్రవం ఉంటుంది. వీటిని 'గ్రేడియేషన్‌ ట్యూబులు' అంటారు. అనుమానిత నమూనాలను, కంట్రోల్‌ నమూనాలను చిన్న చిన్న రేణువులుగా చేసి విడివిడిగా ఈ డెన్సిటీ గ్రేడియెంట్‌ గొట్టాల్లో జారవిడుస్తారు. ఈ ట్యూబుల్లో వివిధ సాంద్రతలు గల ద్రవాలు తేలియాడుతుంటాయి. వీటిలో ముఖ్యంగా బ్రోమోఫామ్‌, బ్రోమో బెంజిన్‌, ఆల్కాహాల్‌, బెంజిన్‌ వంటి ద్రవాలను వాడుతారు. వీటిలో వేసిన మట్టి రేణువులు, వాటి సాంద్రతల ఆధారంగా విడిపోయి అక్కడక్కడా ద్రవాల్లో తేలియాడు తుంటాయి. డెన్సిటీ గ్రేడియెంట్‌ గొట్టాల్లో ఈ ఎత్తులను సరిపోల్చి వాటి తులనాత్మక సాంద్రత (కంపెరేటివ్‌ డెన్సిటీ) ను పోల్చడం ద్వారా ఈ రెండు ఒకే వాహనానికి సంబంధించినవో కాదో నిర్ణయిస్తారు. వివిధ ద్రవాల్లో, వివిధ ఎత్తుల్లో వ్యాప్తి చెందిన ఈ మట్టి రేణువులను ఫొటోగ్రఫీ పద్ధతిలో రికార్డు చేసుకుంటారు. వ్యాప్తిని, అమరికను బట్టి సారూప్యతలను, తేడాలను నిర్ధారిస్తారు.

5. ఫ్లోరోసెన్స్‌ పరీక్షలు : మట్టి శాంపుళ్ళను 315 నానో మీటర్ల నుండి 450 నానో మీటర్ల పౌనఃపున్యపు అతినీలలోహిత కాంతిలో పరీక్షించినపుడు  కొన్ని మట్టి రేణువులు మెరుస్తూ  కనిపిస్తాయి. తద్వారా సారూప్యతను తేల్చిచెప్పవచ్చును. 

6. స్పెక్ట్రోగ్రాఫిక్‌ అనాలసిస్‌ : మట్టిలో అనేక రకాల ప్రధాన  మూలకాలతో పాటు పలు సూక్ష్మ పరిమాణాలలో మూలకాలు 

ఉంటాయి. స్పెక్ట్రోగ్రాఫ్‌ విశ్లేషణ  పరీక్షల ద్వారా ఈ ట్రేస్‌ మూల కాలను కనిపెట్టవచ్చును.

7. ఎక్స్‌రే డిఫ్రాక్షన్‌ పద్ధతి : ఈ పద్ధతి ద్వారా మట్టి నమూనాలలో ఏమైనా ఖనిజాలు ఉన్నాయోమో కనుగొనవచ్చును. మట్టి నమూనాలో గల  ఈ ఖనిజాలు  ఏ రకమైనవి? అవి ఏ మేరకు ఉన్నాయి?  నేరస్థలంలోని మట్టి, అనుమానితుల నుంచి సేకరించిన మట్టిలో ఒకే రకమైన మూలకాలు ఉన్నాయా? లేదా ? అనే విషయాన్ని ఈ సాంకేతిక పద్ధతి ద్వారా ధృవీకరించవచ్చును.

8. ూన పరీక్షలు : రెండు గాజునాళికలలోనికి ఒకదానిలో నేరస్థలంలో  సేకరించిన అనుమానిత మట్టిని, రెండవ దానిలో నమూనా మట్టినీ తీసుకొని దానిని 6 ఎం.ఎల్‌. భాష్ప జలాన్ని కలిపి గాజునాళికలకు బిరడాబిగించి మట్టి బాగా కలిసేలా చేసి ూన పేపర్‌తో గానీ లేదా ఒక్కొక్క దానిలో 10 చుక్కల యూనివర్సల్‌ ఇండికేటర్‌ (సూచికను) కలపగా వచ్చిన రంగు ఆధారంగా దీని ఆమ్లత్వాన్ని కొలిచి సారూప్యతలను, భేదాలను పరిశీలిస్తారు.

మట్టి, దుమ్ము, ధూళి సేకరణ మరియు రవాణా : 

1.          నేలమీద, ఇతర ఉపరితలాల మీద పడిఉన్న మట్టిని, దుమ్మును, ధూళిని బ్రష్‌ సహాయంతో తెల్లని పేపరు మీదకు త్రోసి, జాగత్తగా  పొట్లం కట్టి, దానిని సెల్ఫ్‌లాక్‌ ప్లాస్టిక్‌ కవరులో గాని లేదా చిన్న ప్లాస్టిక్‌ డబ్బాలలో ఉంచి ప్యాక్‌ చేయవచ్చును. 

2.         గట్టిగా అంటుకుపోయిన బురదను, మట్టిని బ్లేడుతో గీకి సేకరించి పంపవచ్చు.

3.         హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో నేలమీద పడి వున్న బంపర్‌ క్రింద మట్టిని, ముందు గడ్డగా ఉన్న ముక్కలను, తదుపరి మిగతా పొడిమట్టిని బ్రష్‌ సహాయంతో ఇతర మట్టి కలువకుండా పేపర్‌ లోకి తీసుకుని, జాగ్రత్తగా  ఆ పేపర్‌ పొట్లాన్ని ప్లాస్టిక్‌ డబ్బాలో గాని, అట్ట డబ్బాలో గాని ఉంచి ప్యాక్‌ చేయాలి. 

4.         బాధితుని మరియు అనుమానితుని వ్యక్తిగత వస్తువులైన చొక్కా, ప్యాంటు, పాదరక్షలు మొదలైన వాటి మీద ఉన్న మట్టిని విడివిడిగా జాగ్రత్తగా సేకరించాలి. ఇందుకు సెలోఫిన్‌ టేపును ఉపయో గించవచ్చు. పరిస్థితులను బట్టితడిదూదితో లేదా తడి ఫిల్టర్‌ పేపర్‌ను ఉపయోగించి వాటితో మట్టిని రుద్ది సేకరించవచ్చు.

5.         నేరస్థలంలో కంట్రోల్‌  మట్టి నమూనాను సేకరించవలసి వచ్చినపుడు నేరస్థలానికి ఒక అడుగు దూరంలోని మట్టినే సేకరించాలి. అలా కాకుండా దూరంగా వుండే చోటు నుంచి సేకరించే మట్టి ఈ నేరస్థలానికి  ప్రాతినిథ్యం వహించే మట్టి నమూనాగా భావించడానికి వీలు లేదు.

6.         బట్టలపై వున్న దుమ్ము, ధూళిని పై పద్ధతుల్లోనే కాక వాక్యుమ్‌ క్లీనర్‌ను ఉపయోగించి కూడా సేకరించవచ్చు.

7.         నేరస్థలంలో కంట్రోల్‌ మట్టి నమూనాలను ఎటువంటి కాలుష్యాలు లేకుండా పై పొరలో నుంచే సేకరించాలి. 

8.         బూట్లకు అంటుకొని వున్న మట్టిని గీకి పంపకుండా వాటిని పేపర్లలో చుట్టి యధాతధంగా న్యాయ వైజ్ఞానిక ప్రయోగశాలకు పంపాలి. 

9.         గోర్లలో ఉన్న మట్టిని శుభ్రమైన పేపర్‌లోకి గీకి ప్యాక్‌చేసి పంపాలి. ఆ గోర్లలోని మట్టిని ఏ మట్టిగా భావిస్తున్నారో, దాని నమూనా మట్టిని వేరుగా ప్యాక్‌ చేసి పంపాలి.

10.       చొక్కా జేబుల్లో, మడతల్లో ఉన్న దుమ్ము, ధూళిని ఒక చిన్న బ్రష్‌ను ఉపయోగించి సేకరించాలి. లేదా వస్త్రాలను పేపర్‌లో చుట్టి, ప్యాక్‌ చేసి ఒక  ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి పంపాలి.

వార్తావాహిని