యూనిట్

ఐదేళ్ల బాలికపై అత్యాచారం- యువకుడు అరెస్టు

గుంటూరు నగరంలో ఏటి ఆగ్రహారం ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన యువకుడ్ని అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్‌ ఎస్పీ పి.హెచ్‌.డి. రామకృష్ణ తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. బాలిక స్కూల్‌ నుండి ఇంటికి వచ్చేసరికి బాలిక తల్లి ఇంటికి తలుపు వేసి వుండడంతో క్రింద ఇంటిలో వుంటున్న తాడిపర్తి లక్ష్మారెడ్డి ఇంటికి వెళ్లింది. ఒంటరిగా వున్న యువకుడు పాపపై అత్యాచారం చేసాడు. పాప ఏడుస్తుండంతో కొట్టి ఎవరికైనా చెబితే చంపుతా అని భయపెట్టి వాళ్ల ఇంటికి పంపించాడు. బాలికకు కడుపులో మరియు మర్మావయువము వద్ద నొప్పిగా వుండడంతో తన తల్లికి చెప్పింది. తన కుమార్తెకు జరిగిన విషయం తెలుసుకున్న తల్లి నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడ్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

వార్తావాహిని