యూనిట్

మీ సేవలు చిరస్మరణీయం

మీ సేవలు చిరస్మరణీయం సుదీర్ఘ కాలంపాటు అంకిత భావంతో పోలీసు శాఖకు అందించిన సేవలు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉన్న 'పెన్నార్‌' కాన్ఫరెన్స్‌ హాలులో ఆగస్ట్‌ నెలాఖరున పదవీ విరమణ పొందిన జమ్మలమడుగు డిఎస్పీ కోలా కృష్ణన్‌, ఎస్సై సుధాకర్‌ రెడ్డి, ఏఎస్సై ఎం.వి.సుబ్బయ్య, ఏ ఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ కె.సి. ఎస్‌.రాజు , కె.హసన్‌ సాహెబ్‌, పి. అబ్దుల్‌ రహిమాన్‌ లను ఎస్పీ జ్ఞాపికలను అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధత తో విధులు నిర్వర్తించినందుకు పోలీసు శాఖ తరపున కతజ్ఞతలు తెలిపారు. విధుల్లో చేరిన నాటి కాలంలో అప్పటి పరిస్థితులను తట్టుకుని కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వర్తించడం మామూలు విషయం కాదన్నారు. పదవీ విరమణ తరువాత కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దష్టి సారించాలని సూచించారు. మరో పదేళ్ళ పాటు మీ అనుభవాలను సమాజానికి అందించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌.పి (ఎ. ఆర్‌) రిషికేశవరెడ్డి,ఎ.ఆర్‌.డి.ఎస్పీ రమణయ్య, ఆర్‌.ఐలు చంద్రశేఖర్‌, జావెద్‌, నాగభూషణం, పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.

వార్తావాహిని