యూనిట్

విజయం పొందే వరకు శ్రమిస్తునే వుండాలి

ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించే వారకు శ్రమిస్తునే వుండాలని విశాఖపట్నం రేంజ్‌ డి.ఐ.జి ఎల్‌.కాళిదాస్‌ వెంకటరంగారావు అన్నారు. వేపగుంట గిరిజన నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో పోలీస్‌ ఉద్యోగాల కోసం శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. శిక్షణ సమయంలో తాము కాస్తా కఠినంగా వ్యవహరిస్తామని, ఓర్పుతో వుండి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మాట్లాడుతూ చిన్న స్థాయిలో ఉద్యోగాలు సాధించిన సంతృప్తి చెందక ఉన్నత ఉద్యోగాలు సాధించే వరకు పోరాడుతునే వుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐటిడిఏ పీవో డీకే బాలాజీ మాట్లాడుతూ శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలలో వెలుగులు నింపాలని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌, పాడేరు డీఎస్‌పీవో రాజ్‌కమల్‌, పాడేరు సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర రావు, వైటీసీ ప్రాజెక్టు అధికారిణి రోషిణి తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని