యూనిట్
Flash News
గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు మహిళలకు అండగా నిలవాలి

మహిళల భద్రతకు
భరోసా కల్పించాలి, అందరూ బాగా పని చేయాలి అని ఏలూరు రేంజ్ డి. ఐ.జి ఏ.యస్ ఖాన్ అన్నారు. పోలీసు శాఖ, మహిళా అభివృద్ది & స్త్రీ , శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో గ్రామ, వార్డు మహిళా
సంరక్షణ కార్యదర్శులకు పెదవేగి లోని జిల్లా పోలీసు శిక్షణ
కేంద్రంలో రెండు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు, ముగింపు
కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. గ్రామ, వార్డు
మహిళా సంరక్షణ కార్యదర్శులు పోలీసుశాఖలో ఒక భాగమేనని అన్నారు. క్రమశిక్షణ పోలీసుశాఖకు చాలా అవసరమన్నారు. ఒక
పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే గ్రామాలకు తగినంత పోలీసు సిబ్బంది లేదన్నారు. అందులో
కొంతమంది సిబ్బంది బందోబస్తులకు వెళ్తున్నారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు
గ్రామాస్ధాయిల్లో పని చేసే ఒక మంచి అవకాశాన్ని వార్డు, గ్రామ
మహిళా సంరక్షణ కార్యదర్శులకు కల్పించారన్నారు. కేటాయించిన విధులను బాగా
నిర్వర్తించాలన్నారు. గ్రామాల్లో ఏ ఒక్క మహిళకు అన్యాయం
జరగకూడదన్నారు. సమస్యలు ప్రతి
మహిళా బాధితురాలికి మహిళా
సంరక్షణ కార్యదర్శులు అండగా ఉండి, దైర్యం కల్పించాలన్నారు.
కౌన్సిలింగ్ చేయాలన్నారు. అవసరమైతే సంబంధిత లోకల్ ఎస్సైల సహాకారం తీసుకోవాలన్నారు. ఐసిడిఎస్ విధులను కూడా
బాగా నిర్వర్తించాలన్నారు.