యూనిట్
Flash News
మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: కడప ఎస్పీ
మహిళలు, చిన్నారుల భద్రతకు, రక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖ ఔన్నత్యాన్ని పెంపొందించాలని కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉన్న 'పెన్నార్' పోలీసు కాన్ఫరెన్స్ హాలు లో జిల్లాలోని 'దిశ' కో-ఆర్డినేటర్ ల తో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. 'దిశ' కో-ఆర్డినేటర్ లుగా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సామాజిక మార్పుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 'దిశ' చట్టం, పోక్సో చట్టం, డయల్ 100, 112, 181, 1098, సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ 9121211100 ల పై ఆయా గ్రామాలు, మండలాల పరిధిలో మహిళలు, బాలికలు, చిన్నారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి ఏ.శ్రీనివాస రెడ్డి , డి.టి.సి ఇంచార్జి డి.ఎస్.పి రంగనాయకులు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, మహిళా ఎస్.ఐ లు, దిశ కో-ఆర్డినేటర్ లు పాల్గొన్నారు.