యూనిట్
Flash News
మహిళల, బాలికల భద్రత కోసం 79 పోలీస్ స్టేషన్ల లో మహిళా మిత్ర ఏర్పాటు: కర్నూల్ రేంజ్ డి ఐ జి
రాష్ట్ర డిజిపి గారి ఆదేశాల మేరకు మహిళలు, బాలికల పరిరక్షణకు జిల్లా
పోలీసు యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని కర్నూలు రేంజ్ డిఐజి పి. వెంకటరామి రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు
కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా మిత్ర సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై
మాట్లాడారు. మహిళల భద్రత కోసం ప్రతి పోలీసు స్టేషన్ లో మహిళా
మిత్ర కో ఆర్డినేటర్ లను( మహిళా, పురుష పోలీసులు), మహిళా మిత్ర కమిటి భ్యులను(స్వచ్చంధ
వాలంటీర్స్) ఏర్పాటు చేసామని అన్నారు. పోలీసు స్టేషన్ లలో మహిళా
మిత్ర కో ఆర్డి నేటర్లు, మహిళా మిత్ర కమిటి సభ్యులుగా సత్
ప్రవర్తన కలిగిన వారినే ఎంపిక చేయాలన్నారు. సమాజంలో మంచి సమాజాన్ని నిర్మించే
విధంగా వారి జీవితాలను ప్రభావితం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్
శ్రీమతి దీపికా పాటిల్, ట్రైని ఐపియస్ టుషార్ డుడి, మహిళా పోలీసుస్టేషన్
డిఎస్పీ వెంకట్రామయ్య, ఎస్పీ పిఎ రంగస్వామి, ఈ కాప్స్ ఇంచార్జ్ రాఘవరెడ్డి , ఇతరులు పాల్గొన్నారు.