యూనిట్
Flash News
అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది...
అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాల
ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభుషణ్
హరిచందన్ గారు అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం అభివృద్ధి
వికేంద్రీకరణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కార్యనిర్వాహక
రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా
అమరావతి,
న్యాయ రాజధానిగా కర్నూలు నిర్ణయం తీసుకున్నారన్నారు. పరిపాలన
వికేంద్రీకరణ వలన ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతందని తెలిపారు. 71వ గణతంత్ర
దినోత్సవం సందర్భముగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపాల్ స్టేడియంలో జాతీయ
పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసుల గౌరవ
వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు, హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ శ్రీ జేకే మహేశ్వరి గారు, ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్ని గారు, డీజీపీ
శ్రీ గౌతమ్ సవాంగ్ గారు, పలువురు మంత్రులు, అధికారులు
పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ గారు ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం
నవరత్నాల పేరిట పలు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
ప్రసుతం గ్రామ సచివాలయల ద్వారా 500 రకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయని, వీటి ద్వారా రాష్ట్రంలోని నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు
లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నవశకం ద్వారా అన్ని వర్గాల సంక్షేమ పథకాలకు
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ రైతు
భరోసా పథకం ద్వారా రూ.13,500 ఆర్థిక సాయం అందిస్తున్నారని, రైతులకు గిట్టుబాటు ధర అందే విధంగా ప్రభుత్వం చర్యలు
తీసుకుంటుందని, అలాగే ధరల స్థిరీకరణ కింద
రూ.3వేలకోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు, ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధరల్లో రాయితీ
అందజేస్తున్నట్లు గవర్నర్ గారు వెల్లడించారు. రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత కోసం
ప్రభుత్వం క షి చేస్తుందని, విద్యకు పేదరికం
అడ్డు కాకూడదని అమ్మ ఒడి పథకం ప్రారంభించిదని గుర్తుచేశారు. ఈ పథకం కింద ప్రతి
విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో
ఇంగ్లీష్ మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు, అన్ని
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని గవర్నర్ స్పష్టం
చేశారు.
కనుల విందుగా
కవాతు......
గణతంత్ర
దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన పరేడ్ కనుల విందుగా సాగింది. కవాతులో ఇండియన్ ఆర్మీ, సిఆర్‌పిఎఫ్, తెలంగాణ స్టేట్
పోలీస్,
ఏపిఎస్పీ 6వ పటాలం, ప్రోహిబిషన్
అండ్ ఎక్సైజ్ శాఖ, ఎన్‌సీసి క్యాడెట్లు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఏపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్, యూత్ రెడ్ క్రాస్‌లు పాల్గొన్నాయి. వీరిలో అత్యుత్తమ
ప్రతిభ కనబర్చిన వారుజు గవర్నర్ గారు అవార్డులతో సత్కరించారు. సాయుధ బలగాల్లో ప్రథమ బహుమతిని ఇండియన్ ఆర్మీ, ద్వితియ బహుమతిని తెలంగాణ స్టేట్ పోలీస్
దక్కించుకున్నాయి. సాయుధ రహిత విభాగంలో ఏపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్
స్కూల్ ప్రథమ బహుమతిని, ఎన్‌సిసి క్యాడెట్
బాలికల బృందం ద్వితియ స్థానాల్లో నిలిచాయి.
అబ్బురపరిచిన
శకటాల ప్రదర్శన....
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ
వివధ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన జరిగినది.
వ్యవసాయ, గహ నిర్మాణ, జల వనరులు, ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివద్ధి, మద్యనిషేధ
మరియు అబ్కారీ, సమగ్ర శిక్షా-విద్యా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పశు సంవర్థక, మత్స్య, అటవీ, రాష్ట్ర
నైపుణ్యాభివద్ధి, పర్యాటక, మహిళాభివద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శటకాలను ప్రదర్శించారు. వీటిలో పాఠశాల విద్యాశాఖ
శకటానికి ప్రథమ బహుమతి లభించింది. మహిళాభివద్ధి-శిశు సంక్షేమశాఖ (దిశా చట్టం పై శకటానికి) రెండో బహుమతి
లభించింది. వ్యవసాయశాఖ శకటానికి మూడో బహుమతి దక్కింది.