యూనిట్

అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని భర్తను హత్య చేసిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని భర్తను హత్య చేసిన భార్య విశాఖపట్నం నగరంలోని మద్దిలపాలెంలో అనుమానస్పదంగా మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి దల్లి సతీష్‌ కుమార్‌ కేసును ఛేదించినట్లు నగర పోలీస్‌ కమీషనర్‌ ఆర్‌.కె.మీనా తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. మృతుడు ఇండియన్‌ ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు కలరు. మృతుడి భార్య జ్యోతికి 9 నెలలు క్రితం సిమ్మ భరత్‌తో పరిచయం ఏర్పడింది, అది శారీరక సంబందానికి దారితీసింది. మృతుడు సెలవుపై జులై నెలలో తన స్వగ్రామానికి వచ్చాడు. మృతుడికి తన భార్య సిమ్మ భరత్‌తో శారీరక సంబందం పెట్టుకుందని తెల్సుకుని భార్యను ప్రశ్నించాడు. భర్తకు తన వివాహేతర సంభందం గూర్చి తెలియడంతో భయపడి భర్తను హతమార్చాలని జ్యోతి తన ప్రియుడు సిమ్మ భరత్‌కు తెలియజేసింది. ఇద్దరు హత్య చేయడానికి పథకం పన్ని చాలా జాగ్రత్తగా అమలు చేసారు. పధకం ప్రకారం జ్యోతి సతీష్‌ కుమార్‌ తాగే మధ్యంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. సిమ్మ భరత్‌ మరియు అతని స్నేహితుడు భాస్కర్‌ కలిసి వారి పిట్ట గోడ మీదుగా ఇంటిలోకి ప్రవేశించి మృతుడుని చున్నీతో చుట్టీ చంపేసారు. అనంతరం చీరతో ఫ్యాన్‌కు ఉరివేసి వారిద్దరు బయటకు వెళ్ళిపోయారు. మృతుడి భార్య తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అత్త, మామలకు చెప్పింది. ముందుగా పోలీసులు అత్మహత్య కేసుగా నమోదు చేసుకుని విచారణలో హత్య కేసుగా తేలడంతో నిందితులు ముగ్గురు జ్యోతి, సిమ్మ భరత్‌, భాస్కర్‌లను అరెస్టు చేసినట్లు కమీషనర్‌ తెలిపారు.

వార్తావాహిని