యూనిట్
Flash News
మన్యం వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు విస్తృత దాడులు

మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల తో పోలీసు అధికారులు, సిబ్బంది
గురువారం మద్యం, ఇసుక, గంజాయి, కోడిపందాలు మరియు జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి,
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు
అధికారులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి ట్రాఫిక్ నిబందనలు ఉల్లంగించిన వారిపై
యం. వి. చలనాలు విధించి వారిపై కేసులు
నమోదు చేశారు. అలాగే ప్రజలకు, రహదారి భద్రత లో బాగంగా
తీసుకోవాల్సిన జాగ్రత్తులు మరియు వాటి వలన కలిగే అనర్థాలు పట్ల అవగాహన కల్పించారు.
ప్రజలకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించి,
డౌన్లోడ్ చేయించి
రిజిస్ట్రేషన్ చేయించారు.