యూనిట్

అతివలకు అండగా మహిళా మిత్ర

మహిళలకు ఏ ఆపద వచ్చినా మహిళామిత్రలు వారికి అండగా మేమున్నామని భరోసా కల్పించాలని డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్  గారు ఆకాక్షించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని రామరాజు ఫంక్షన్‌హాలులో నిర్వహించిన మహిళామిత్ర కార్యక్రమానికి డిజిపి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో తొలిసారిగా ప్రారంభించిన మహిళామిత్ర కార్యక్రమం ఎంతో విజయం సాధించిందన్నారు. మహిళలుబాలికలుపై ఏ విధమైన దాడులుఅత్యాచారాలువేధింపులు జరుగకుండా చూడాలనిఅటువంటి ఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారని తెలిపారు.

    అందుకు అనుగుణంగానే మహిళామిత్రసైబర్‌మిత్రలను రాష్ట్రవ్యాప్తంగా అమలుపరుస్తున్నామన్నారు. మహిళలుబాలికలు తమ సమస్యలను ఏ సంకోచం లేకుండా ఈ బృందాల ద్వారా తెలియజేసుకొని తగు పరిష్కారంరక్షణ పొందవచ్చన్నారు. పోలీసులకు బాధిత మహిళలకు మధ్య ఈ బృందాలు వారధిలా పనిచేస్తాయన్నారు. కొన్ని సందర్భాలలో మహిళా సమస్యల పరిష్కారంలో పోలీసులకు కొన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు వుంటాయనిమహిళామిత్రసైబర్‌మిత్రల ద్వారా వాటికి తావు లేకుండా పటిష్టమైనపరిపూర్ణమైన భద్రత లభిస్తుందన్నారు.

    ప్రస్తుతం అమలు చేస్తున్న స్పందనలో 52 శాతం మహిళా ఫిర్యాదులే వుంటున్నాయన్నారు. అందుచేత ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిదిలో పది నుండి పదిహేను మహిళామిత్ర బృందాలు వుండేటట్లు చర్యలు చేపడుతున్నామన్నారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌జేసీ డా. కె. మాధవీలతజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ఏఎస్పీ సరితబొల్లినేని కీర్తి తదితరులు మహిళా బృందాలను ఉద్ధేశించి ఉపన్యసించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కర్రసాముబుర్రకథ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. డీఐజీ పాలరాజుకేఆర్‌యు వైస్‌ ఛాన్సలర్‌ సుందర కృష్ణడీఈవో రాజ్యలక్షిజిల్లా వ్యాప్తంగా డీఎస్పీలుసీఐలు ఇతర అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.

 

 

వార్తావాహిని