యూనిట్
Flash News
ప్రజా సమస్యల పరిష్కారానికి వాట్సాప్
పశ్చిమగోదావరి
జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కా రానికి, నేరుగా వాట్సాప్‌లో తమ సమస్యలు, వినతులను
తెలుపవచ్చని జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ తెలిపారు. సమస్యలు తెలుపుటకు 9550351100 అను వాట్సాప్ మొబైల్ నెంబరును ప్రజలకు అందుబాటులోకి ఉంచుతున్నట్లు
తెలిపారు. ఈ సందర్భంగా వాట్సాప్ నెంబర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. మహిళలు,
వృద్ధులు తమ సమస్యలు విన్నవించడం ద్వారా తమకు ఎదురయ్యే సమస్యలను
నేరుగా పోలీసులు పరిష్కరిస్తారని, వివరాలను గోప్యంగా ఉంచి
విచారణ సాగిస్తామన్నారు. ఎక్క డైనా సమస్యలు జరిగితే వెంటనే పోలీసులకు తెలుపాలని,
సమాచారమిచ్చిన వారిని ప్రోత్సహించడంతోపాటు అభినందించడం జరుగు
తుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి.లు తదితరులు పాల్గొన్నారు.