యూనిట్

భారత రాష్ట్రపతికి సాదర స్వాగతం

భారత రాష్ట్రపతి, గౌరవనీయులు శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ గారు శ్రీహరికోటకు ఒక రోజు పర్యటన నిమిత్తం తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు రాష్ట్రపతిగారికి పుష్పగుచ్చం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర డీజీపీ శ్రీ డి. గౌతమ్‌ సవాంగ్‌ గారు, అదనపు డిజిపి రవిశంకర్‌ అయ్యన్నార్‌, డిఐజి కాంతిరాణా టాటా, తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి. కె.అన్బురాజన్‌లు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. శ్రీహరికోటలో 'చంద్రయాన్‌-2' రాకెట్‌ లాంచ్‌ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవ రాష్ట్రపతిగారు రాష్ట్రానికి విచ్చేశారు. రాష్ట్రపతిగారి పర్యటన సందర్భంగా డిఐజి, జిల్లా ఎస్‌.పి.లు పటిష్ట బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. శ్రీహరికోటలో గౌరవ రాష్ట్రపతిగారు బస చేశారు. చంద్రయాన్‌ ప్రయోగం అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.

వార్తావాహిని