యూనిట్
Flash News
చారిత్రాత్మక నిర్ణయం- పోలీసులకు వారాంతపు సెలవు
దశాబ్ధాలుగా
పోలీస్ శాఖను అందని ద్రాక్షలా ఊరిస్తున్న వారాంతపు సెలవు ఆనందాలను మోసుకుంటూ
అందుబాటులోకి వచ్చి, పోలీస్
కుటుంబాలలో సరికొత్త వెలుగు పంచుతోంది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్
రెడ్డి గారి సహృదయత, చొరవ వలన ఈ చిరకాల స్వప్నం సాకారమైంది.
కానిస్టేబుల్ నుండి ఇన్‌స్పెక్టర్ స్థాయి సిబ్బంది వరకు వారాంతపు సెలవు అమలు
చేస్తున్నామని డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. మంగళగిరి పోలీస్
ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధుతో ఏర్పాటు చేసిన సమావేశంలో
ఆయన ప్రసంగించారు. పోలీస్‌ల వృత్తి భాధ్యతలు తీవ్ర ఒత్తిడి, కాలాతీత
పరిస్థితుల్లో కొనసాగుతాయని గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్
రెడ్డి గారు వారాంతపు సెలవు ప్రతిపాదించి, తద్వారా సిబ్బంది
ఆరోగ్య, ఆయువు ప్రమాణాలు పెంపొందడానికి దోహదం చేసారని
ప్రశంసించారు.
సిబ్బంది
అందుబాటు, వారి పని స్వభావం ఆధారం చేసుకొని
వారాంతపు సెలవుకు 19 రకాల పద్దతులను రూపొందించామని, ఆయా విభాగాల అధిపతులు తమకు అనువైన పద్దతులను అనుసరించవచ్చని చెప్పారు.
రాష్ట్ర పోలీస్ శాఖలో మొత్తం 70 వేల సిబ్బందికి ఈ వారాంతపు
సెలవు వర్తిస్తుందన్నారు. వారాంతపు సెలవును పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను
తయారు చేసామని, నెలకోసారి ఈ విధానాన్ని సమీక్షించి మరింత
సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. వారాంతపు సెలవు అధ్యయన కమిటీకి నేతృత్వం వహించిన
శాంతి భద్రత అదనపు డిజి శ్రీ రవిశంకర్ అయ్యన్నార్ మాట్లాడుతూ ప్రస్తుతం పోలీస్
శాఖలో 12,384 ఖాళీలు ఉన్నాయని, అవి
కూడా భర్తీ అయితే వారాంతపు సెలవును మరింత సమర్థవంతంగా అమలు చేయొచ్చన్నారు. వారంతపు
సెలవుపై తమ కమిటీ రూపొందించిన నివేదికలో ఈ విషయం స్పష్టం చేసామన్నారు.
ప్రస్తుతానికి
సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న వారిని వినియోగించడం
ద్వారా వారాంతపు సెలవుకు ఆటంకం లేకుండా చూసుకోవాని డిజిపి సూచించారన్నారు. ఈ
విధానం అమలుపై ప్రతి రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు.
శ్రీ రవిశంకర్ అయ్యన్నార్ కమిటీ చేసిన సిఫారుసులివి..
-
రోజు మార్చి రోజు చొప్పున బడ్డీ పెయిర్స్ ఏర్పాటు చేసి ఒకరు 24 గంటు డ్యూటీలో ఉంటే మరొకరు 24 గంటు చేస్తారు. నెకు 360 గంట పాటు డ్యూటీలో వున్నా 120 గంటు అప్రమత్తంగా, 240 గంటు నామమాత్రంగా ఉండాలి.
ఎస్.హెచ్.వో రోజు మార్చి రోజు 24 గంటు ఆఫ్ తీసుకోవచ్చు.
-
నాలుగు రోజులకోసారి కానిస్టేబుళ్ళు స్వాపింగ్ పద్దతిలో డ్యూటీు చేసుకోవచ్చు.
బడ్డి పెయిర్ పద్దతిలో ఇద్దరు కానిస్టేబుళ్ళను జత చేస్తారు.
-
ఒకరు పగలు డ్యూటీ వారం చేస్తే మరొకరు రాత్రి డ్యూటీ చేస్తారు. వారం తరువాత
డ్యూటీను మార్చుకుంటారు.
-
ముగ్గురు కానిస్టేబుళ్ళు ఒక గ్రూప్‌లో వుంటారు. ఎ, బి, సి పద్దతిలో 8 గంటల షిప్టు
ఉంటుంది.
-
ఆరుగురిని ఒక జట్టుగా చేసి స్టేషన్లలో మూడు ఉదయం షిప్టు, రెండు డే షిప్టు, ఒక
నైట్ షిప్టుల కింద డ్యూటీలు చేసి ఒక రోజు సెలవు తీసుకుంటారు.
-
తొమ్మిది మంది సిబ్బందికి సంబంధించి నలుగురికి ఉదయం, ఇద్దరికి నైట్ షిప్టు డ్యూటీలు, మరో ముగ్గురికి డే
డ్యూటీలు ఉంటాయి. వీరిని ఎ టూ ఐగా విభజించి డ్యూటీలు నిర్ణయిస్తారు. ఇందులో
సిడీఈఎఫ్, ఈఎఫ్‌జిహెచ్, జీహెచ్‌ఐఏ
ఇలా ఏది అనుకులమైతే అది ఎస్‌హెచ్‌ఓ నిర్ణయించుకోవచ్చు.
- 9మంది ఐదు విభాగాలుగా చేస్తే 5 ఉదయం, ఒకటి నైట్, మూడు డే
డ్యూటీలు ఉంటాయి.
- 12 మంది సిబ్బంది గ్రూపుగా వుంటే, ఐదు భాగాలు డే డ్యూటీలో, మూడు భాగాలు రాత్రి
విధుల్లో మిగతా వారు వీక్లీ ఆఫ్ ఇతర డ్యూటీలు వుంటాయి.
- 12 మందిని ఏడు విభాగాలుగా విభజించి ప్రతి
షిప్టులో ఏడుగురు డ్యూటీలో ఉండేలా చార్జ్ నిర్ణయిస్తారు.
- 15 మంది సిబ్బంది గ్రూపుగా ఉంటే మార్నింగ్
షిప్టు ఎక్కవగా, రాత్రి డ్యూటీలు తక్కువగా వుంటాయి.
- 8 విభాగాలుగా డ్యూటీలు నిర్ణయించి ప్రతి ఇద్దరికి
ఒకేలా డ్యూటీ ఉండేలా చూస్తారు, ఇందులో డే డ్యూటీలు 8,
నైట్ డ్యూటీలు 2 చేయాల్సి వుంటుంది.
- 7:3గా నిర్ణయించి మార్నింగ్ షిప్టు 7, రాత్రి డ్యూటీలు 3 చేయిస్తారు. మిగతా ఐదుగురిని ఇతర
డ్యూటీలు, వీక్లీఆఫ్‌లో ఉంచుతారు. - 6:4గా విభజించి డే డ్యూటీలు 6, నైట్ డ్యూటీలు నాలుగు
ఉంటాయి.
-
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ మొదటి షిప్ట్, 1`9 వరకు రెండో షిప్ట్,
రాత్రి 9 నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటవరకు మూడో షిప్ట్ కింద డ్యూటీలు వేస్తారు.
-
వీక్లీ ఆఫ్‌ల విషయానికొస్తే 1/7
సిబ్బంది వుంటే ప్రతి రోజు ఒకరికి సెలవు ఇస్తారు, జనరల్,
ట్రాఫిక్ డ్యూటీలు ఇందులో వుంటాయి. - కోర్టు కానిస్టేబుల్,
స్టేషన్ రైటర్లకు ఆదివారం ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి.
-
ఏపిఎస్పీ పోలీసులకు కంపెనీలో ఉండే వారిలో ప్రతి నాలుగు రోజులకు సెలవు తీసుకోవచ్చు.
-
గార్డు డ్యూటీలు చేసే వారు వరుసగా మూడు రోజులు విధుల్లో వుంటే, తర్వాత రెండు రోజులు సెలవు తీసుకోవచ్చు.
-
ఎస్కార్ట్ సిబ్బంది మూడు రోజులు వీఐపితో డ్యూటీలో వుంటే ఒక రోజు సెలవు
తీసుకోవచ్చు. వారాంతపు సెలవును క్రిందిస్థాయి అధికారి కాదనకుండా సాప్ట్‌వేర్
ద్వారా చార్ట్ సిద్దం చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి సంబంధిత
స్టేషన్లకు సీసీటిఎన్‌ఎస్ ద్వారా వారాంతపు సెలవు వివరాలతో కూడిన షీట్ అందుతుంది.
డ్యూటీ వివరాలతో కూడిన షీట్‌ను స్టేషన్ రైటర్ నోటీసు బోర్డులో అతికించాలి.
వారాంతపు
సెలవు అమలు చారిత్రాత్మక నిర్ణయం: సుదీర్ఘ కాలంగా పోలీసు ఎదురుతెన్ను కాస్తున్న
వారాంతపు సెలవు అమలు చేయడం గొప్ప చారిత్రాత్మక నిర్ణయం అని, ఇది పోలీస్ శాఖ లోనే నూతన అధ్యాయమని పోలీస్
అధికారుల సంఘం అధ్యక్షుడు జె శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేసారు. ఈ ఘనతకు కారకులైన
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారికి, డిజిపి
శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారికి పోలీస్ సిబ్బంది, వారి
కుటుంబాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నారు.