యూనిట్
Flash News
దిశ చట్టంను అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటాం : నెల్లూరు ఎస్పీ

నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న సఖి (ఒన్ స్టాప్ సెంటర్) నందు జనవరి నెలను “దిశ నెల”గా ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ వారు “ఆపదలో ఉన్న మహిళలకు ఆపన్న హస్తం” అనే నినాదంతో ఏర్పాటు చేసిన పోస్టర్ ను పలు జిల్లా అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే పలు నేరాలు గృహ హింస, అత్యచారులు, లైంగిక వేధింపులు, మహిళల అక్రమ రవాణా, మైనర్ బాలికలపై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సుశిక్షితులైన సిబ్బందితో పాటు అన్ని సదుపాయాలు ఈ సెంటర్ ల నుండి పొందవచ్చని తెలిపారు. మన రాష్ట్రంలో “దిశ”పై స్పెషల్ ఫోకస్ ఉన్నందున మహిళల భద్రత కోసం సఖి మరియు దిశ మహిళా పోలీస్ స్టేషన్లు లు మరింత సమన్వయముతో పని చేసి, మంచి ఫలితాలు రాబట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ పి.వి.వి.యస్. మూర్తి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్ జె డి శారద, ఉమెన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీధర్, ఐసిడి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి సుధా భారతి, ఏ పి డి శ్రీమతి శేషకుమారి, ఓఎస్ సి అడ్మిన్ శ్రీమతి ఎస్ .సహనాస్, మొదలగు వారు పాల్గొన్నారు.