యూనిట్

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

విధినిర్వహణలో మృతిచెందిన, పదవి విరమణ పొందిన పోలీసు ఉద్యోగుల పోలీస్‌ సిబ్బంది కుటుంబాల సంక్షేమం గుంటూరు అర్బన్‌లో అదనపు ఎస్‌.పి. అడ్మిన్‌, డిఎస్‌పి బి.సీతారామయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బాధిత కుటుంబాలు, పదవీ విరమణ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్‌పి సీతారామయ్య మాట్లాడుతూ ఎస్‌.పి. పి.హెచ్‌.డి. రామకృష్ణ ఆదేశాలతో పోలీసు ఉద్యోగుల సర్వీసు మేటర్స్‌ నందు ఎలాంటి ఆలస్యం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు, డిజిపిగారి ఆదేశాలతో పదవి విరమణ పొందిన పోలీసు ఉద్యోగులు, మృతిచెందిన పోలీస్‌ సిబ్బందికి ప్రభుత్వం, పోలీసుశాఖ నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌పై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమములో ఏవో ఎన్‌.శేషశయనారావు, వెల్ఫేర్‌ ఆర్‌ఐ ప్రగడా విజయసారది,అధికారుల సంఘం కార్యదర్శి సిహెచ్‌ కిషోర్‌, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దళవాయి సుబ్రహ్మణ్యం పలువురు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని