యూనిట్
Flash News
అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం
రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ పోలీస్ అధికారుల సంక్షేమం దినోత్సవం పురస్కరించుకొని విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలు, పదవీ విరమణ చేసిన సిబ్బందితో ఎస్.పి. సమావేశమయ్యారు.ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు రావాల్సి సహాయం, నగదు విషయాలపై పోలీస్ అధికారుల కుటుంబాల వారితో సమావేశం నిర్వహించారు. వీటిపై ఎస్పీ వెంటనే ఏవో నరసింహమూర్తి, ఉద్యోగస్తులతో మాట్లాడి పరిష్కార మార్గాలను వెంటనే చూపించాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి కె.శ్రీనివాసాచారి. కష్ణంరాజు, సిఐ జి.వి.క ష్ణారావు, 17 పోలీస్ కుటుంబ, అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కె.వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.