యూనిట్

అమరులకు రుణపడి ఉంటాం

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో తిరుపతి అలిపిరి గరుడ సర్కిల్‌ నుండి జూపార్క్‌ వరకు మారాథాన్‌ 5కే పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌.పి. డాక్టర్‌ గజరావు భూపాల్‌ హజరై మారాథాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది మరియు కళాశాల యువతి-యువకులు సుమారు 700 మంది ఉత్సాహంగా పరగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌.పి. మాట్లాడుతూ దేశ సరిహద్దులో, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగాలు చేస్తున్న పోలీసుల త్యాగాలను మరవలేమన్నారు. రాష్ట్ర డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఈ మారాథాన్‌ పరుగును నిర్వహించామన్నారు. ఈ మార థాన్‌లో ర్యాలీలో స్వచ్చందంగా పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ఒకటి నుండి ఐదు స్థానాల వరకు విజ యం సాధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డిఎస్‌పిలు సి.ఎస్‌. గంగయ్య, మురళీక ష్ణ, నరసప్ప, అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాలొన్నారు.

వార్తావాహిని