యూనిట్
Flash News
స్వచ్ఛభారత్‌కింద హాస్టళ్ళ దత్తత తీసుకుంటాం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా అంతటా ప్రభుత్వ హాస్టల్స్, పాఠశాలల నందు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ అపరిశుభ్రతను గమనించి జిల్లాలోని హాస్టల్‌లలోనూ, పాఠశాలల్లో పోలీసు వారిచే అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్వచ్ఛభారత్ కార్యక్రమమును నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈసందర్భంగా పోలీసు సిబ్బంది జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛభారత్ నిర్వహించి, ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అదనపు ఎస్.పి. మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌కింద హాస్టళ్ళను దత్తత తీసుకుంటామన్నారు. కార్యరకమంలో అదనపు ఎస్.పి. ఎం.మహేష్ కుమార్, డిఎస్‌పిలు డాక్టర్ దిలీప్ కిరణ్, కష్ణం రాజు, ఆర్.ఐ.లు, ఇతర ఉన్నతాధికారులు, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.