యూనిట్
Flash News
ప్రజలకు దిశా యాప్ పై అవగాహన కల్పిస్తున్న విజయనగరం పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి
ఎం.దీపిక, ఆదేశాలతో పోలీసు అధికారులు,
సిబ్బంది గురువారం మద్యం, ఇసుక, గంజాయి, పశువులు అక్రమ రవాణా, కోడి
పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు
నిర్వహించారు. ప్రజలకు దిశా యాప్ పట్ల
అవగాహన కల్పించి, ఒకరితో యాప్ డౌన్లోడ్ చేయించారు. ఇప్పటి
వరకు 7,87,823మంది యాప్ డౌన్లోడ్
చేయించగా, 4,59,252మంది
తో రిజిస్ట్రేషన్ చేయించారు. పోలీసులు,
సెబ్ అధికారులు జిల్లాలో మద్యం, నాటుసారా
నియంత్రణలో భాగంగా దాడులు నిర్వహించి, 4 కేసులు నమోదు చేసి,
4గురిని అరెస్టు చేసి, 19.62 లీటర్ల IMFL
మద్యం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి,
ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై 18 కేసులు నమోదు చేశారు.
ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 45 కేసులు నమోదు చేసి, రూ.
13,175/- లను ఈ - చలానాగా విధించారు.