యూనిట్

విజయనగరం జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించిన పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపికఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది శనివారం మద్యం, ఇసుక, గంజాయి, పశువులు అక్రమ రవాణా, కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై 20 కేసులు నమోదు చేశారు.  మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 12 కేసులు నమోదు చేశారు.  ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 517 కేసులు నమోదు చేసి, రూ. 1,56,395/- లను ఈ - చలానాగా విధించారు.ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి ప్రజలకు మహిళల భద్రత, సైబరు నేరాలు, రహదారి భద్రత, డ్రగ్స్ వలన కలిగే అనర్థాలు పట్ల అవగాహన కల్పించారు.

వార్తావాహిని