యూనిట్

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గౌరవ ఉపరాష్ట్రపతి పర్యటన

సోమవారం నుండి రెండు  రోజుల నెల్లూరు  జిల్లా పర్యటనను గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ముగించుకొని ఈ రోజు ఉదయం 8.30 గంటలకు వెంకటాచలం రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైల్ లో చెన్నై కి బయలుదేరారు. ఆ  సమయంలో జిల్లా యస్.పి.  భాస్కర్ భూషణ్,   ఉపరాష్ట్రపతి గారికి పుష్పగుచ్చం అందజేసి వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి గౌరవ ఉపరాష్ట్రపతి, గౌరవ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ మరియు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశంక్ గార్ల పర్యటన ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని చర్యలు తీసుకొని బందోబస్త్ విజయవంతంగా నిర్వహించడమైనది. ఈ సందర్భంగా జిల్లా యస్.పి.   వెంకటాచలం రైల్వే స్టేషన్ లో వివిఐపి  బందోబస్త్ విధులలో పాల్గొన్న ఐఎస్ డబ్ల్యూ , సెంట్రల్ మరియు స్టేట్ ఇంటలిజెన్స్, రైల్వే మరియు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి డీ-బ్రీఫింగ్ ఇచ్చారు.  

వార్తావాహిని