యూనిట్

నగర ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్

విశాఖపట్నం  నగర ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు మరియు ఆటో డ్రైవర్లతో   పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నగర పోలీస్ కమిషనర్ డా. సి.యం.త్రివిక్రమ వర్మఇతర అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుని, సత్వరం వారి సమస్యలు తీరే విధముగా తగు ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. అదే విధంగా నేరాల నియంత్రణలో వారి తోడ్పాటు అందించడంతో పాటుగా స్థానిక పోలీసులతో పూర్తి సమన్వయంలో ఉండేలా పలు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నగర పోలీస్ అధికారులు, వివిధ ఆరు వర్కర్స్ సంగాల ప్రతినిధిలు పాల్గొన్నారు.

వార్తావాహిని