యూనిట్

కడప జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ సభలు

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా ఆయా పోలీసు స్టేషన్ ల పరిధిలోని  గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించినట్లు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బు రాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలతో పాటు రౌడీ షీటర్లకు, మట్కా బీటర్లకు, గ్యాంబ్లర్లకు, క్రికెట్ బెట్టర్ లకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్.పి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.పి గారు హెచ్చరించారు.  

కడప సబ్ డివిజన్ పరిధిలో:

వి.ఎన్ పల్లి  పి.ఎస్ పరిధిలో టౌన్ లో వాహన తనిఖీలు నిర్వహించారు.

పెండ్లిమర్రి పి.ఎస్ పరిధిలో పెండ్లిమర్రి హరిజనవాడ వద్ద, ఎర్రగుంట్ల పి.ఎస్ పరిధిలో కదిరేపల్లి వద్ద గ్రామ సభ నిర్వహించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో:

వేంపల్లి పి.ఎస్ పరిధిలో కడప బై పాస్ రోడ్ వద్ద, చక్రాయపేట పి.ఎస్ పరిధిలో నాగులగుట్టపల్లి వద్ద, రాయచోటి అర్బన్ పి.ఎస్ పరిధిలో చిత్తూర్ హై వే పై రింగ్ రోడ్ వద్ద, వీరబల్లి పి.ఎస్ పరిధిలో గురప్ప గారి పల్లి క్రాస్ వద్ద , సుండుపల్లె పి.ఎస్ పరిధిలో భైరవగుట్ట వద్ద  వాహన తనిఖీలు నిర్వహించారు.

చక్రాయపేట పి.ఎస్ పరిధిలో చిలేకాంపల్లి గ్రామంలో, రామాపురం పి.ఎస్ పరిధిలో ఓబుల్రెడ్డి గారి పల్లి లో, రాయచోటి  పి.ఎస్ పరిధిలో గోర్లముదివీడు గ్రామంలో, వీరబల్లి పి.ఎస్ పరిధిలో కట్టకాడపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి  రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో:

వన్ టౌన్ పి.ఎస్ పరిధిలో బై పాస్ రోడ్ లో మని కేఫ్ వద్ద,  టూ టౌన్ పి.ఎస్ పరిధిలో ఏ.కే. రోడ్ పై, త్రి టౌన్ పి.ఎస్ పరిధిలో బొల్లవరం లో, చాపాడు పి.ఎస్ పరిధిలో కొత్తపల్లె చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.

వన్ టౌన్ పి.ఎస్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్, రాజుపాలెం పి.ఎస్ పరిధిలో తొండలదిన్నె గ్రామంలో గ్రామ సభ నిర్వహించి దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.

జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిధిలో:

మైలవరం పి.ఎస్ పరిధిలో తాడిపత్రి - జమ్మలమడుగు రహదారిపై మహేశ్వర కల్యాణ మండపం వద్ద, తొండూరు పి.ఎస్ పరిధిలో పి.ఎస్ పరిధిలో పి.ఎస్ ఎదుట వాహన తనిఖీలు నిర్వహించారు.

ముద్దనూరు పి.ఎస్ పరిధిలో పాత బస్సు స్టాండ్ నందు విజిబుల్ పోలీసింగ్ మరియు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.

జమ్మలమడుగు అర్బన్ పి.ఎస్ పరిధిలో గండికోట గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గండికోట వారోత్సవాలపై అవగాహన కల్పించారు.

మైలవరం పి.ఎస్ పరిధిలో తొర్రివేముల గ్రామంలో, పెద్దముడియం పి.ఎస్ పరిధిలో నాగరాజుపల్లె గ్రామంలో గ్రామ సభ నిర్వహించి రానున్న  స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో:

పుల్లంపేట పి.ఎస్ పరిధిలో ఓల్డ్ బస్సు స్టాండ్ వద్ద, ఒంటిమిట్ట పి.ఎస్ పరిధిలో శ్రీ రామ కల్యాణవేదిక వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.

రాజంపేట అర్బన్ పి.ఎస్ పరిధిలో రామ్ నగర్ లో గ్రామ సభ నిర్వహించి సైబర్ మిత్ర, మహిళా మిత్ర పై అవగాహన కల్పించారు.

నందలూరు పి.ఎస్ పరిధిలో చింతలకుంట గ్రామంలో, పుల్లంపేట  పి.ఎస్ పరిధిలో దళవాయి పల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి  రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఒంటిమిట్ట పి.ఎస్ పరిధిలో ఎర్ర చందనం స్మగ్లర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో:

దువ్వూరు పి.ఎస్ పరిధిలో దువ్వూరు టౌన్ లో విజిబుల్ పోలీసింగ్ మరియు వాహన తనిఖీలు నిర్వహించారు.

గోపవరం పి.ఎస్ పరిధిలో పి.పి కుంట చెక్ పోస్టు వద్ద, అట్లూరు పి.ఎస్ పరిధిలో అట్లూరు క్రాస్ వద్ద, పోరుమామిళ్ల పి.ఎస్ పరిధిలో మార్కాపురం చెక్ పోస్టు వద్ద  వాహన తనిఖీలు నిర్వహించారు. అట్లూరు పి.ఎస్ పరిధిలో బెడుసుపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి  రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వార్తావాహిని