యూనిట్

స్వర్గీయ శ్రీ కె ఎస్ వ్యాస్ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన విజయవాడ పోలీస్ కమీషనర్

మాజీ ఐపిఎస్ అధికారి  స్వర్గీయ   శ్రీ కె ఎస్ వ్యాస్ గారి 27 వర్ధంతి సందర్భముగా విజయవాడ నగరంలో వ్యాస్ కాంప్లెక్స్ వద్ద గల అతని విగ్రహానికి నగర పోలీస్ కమీషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అయన చేసిన సేవలు స్మరించుకుంటూ రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో డిసిపిలు టి. నాగరాజు, శ్రీమతి ఎబిటి ఎస్ ఉదయరాణి, ఎడిసిపిలు నవాబ్ జాన్, ఎసిపి చెంచు రెడ్డి, ఏవో టి. రంగారావు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని