యూనిట్
Flash News
వనం - మనం'లో విజయవాడ పోలీసుల కృషి అభినందనీయం..
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'వనం - మనం' కార్యక్రమంలో విజయవాడ నగర పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమైనదని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అన్నారు. నగర పోలీస్ కమీషనరేట్‌లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేతన కొండలో వున్న పోలీస్ శాఖకు సంబంధించిన స్థలంలో నిర్వహించిన వనం - మనం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే పోలీస్ విధి నిర్వహణ ఎంతో ఒత్తిడితో కూడుకున్నది, అయినా నగర పోలీస్ కమీషనర్ శ్రీ సి.హెచ్. ద్వారకా తిరుమలరావు గారు ఆధ్వర్యంలో సమాజ శ్రేయస్సు కోసం విస్తృతంగా మొక్కలు నాటుతున్నారన్నారు. వాటి సంరక్షణ బాధ్యతలను కూడా నిర్వర్తించడం శుభపరిణామమన్నారు. అనంతరం నగర పోలీస్ కమీషనర్ శ్రీ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు గారు మాట్లాడుతూ నగరంలో వనం మనం కార్యక్రమం జూలై1న ప్రారంభించి ఇప్పటివరకు సుమారు 12 వేల మొక్కలను నాటడం జరిగిందన్నారు. గత సంవత్సరం కమీషనరేట్‌లో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కంటే కూడా 28 వేల మొక్కలను అధికంగా నాటామన్నారు. కార్యక్రమంలో నగర సంయుక్త కమీషనర్ డి. నాగేంద్రకుమార్, ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌పర్ట్ కొడాలి సుబాష్‌చంద్రబోస్, అడ్మిన్ డీసీపీ డి.కోటేశ్వర రావు, శాంతి భద్రతల డీసీపీలు విజయరావు, హర్షవర్ధన రాజు, ట్రాఫిక్ డీసీపీ వై.రవిశంకర్ రెడ్డి, టెక్నికల్ వింగ్ డీసీపీ శ్రీమతి ఏబీటీిఎస్ ఉదయరాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.