యూనిట్
Flash News
న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్ లో 38 మందిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీస్
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా విజయవాడ నగరంలో ఎటువంటి అవాంఛనీయ
ఘటనలు జరుగకూడదన్న ఆలోచనతో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు గారి ఆదేశానుసారం డిసిపి టి వి నాగరాజు
ఆధ్వర్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ లు
నిర్వహించారు. నగరంలోని వివిధ సెంటర్లలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది
రాత్రి 11 గంటల నుండి తెల్లవారు 4 గంటల వరకు వాహనదారులపై డ్రంకన్ డ్రైవ్
నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజ్, సితార సెంటర్,ఆర్ టి ఏ జంక్షన్, పిసిఆర్ జంక్షన్, ఫుడ్ జంక్షన్, పైపుల రోడ్ జంక్షన్, ఎన్ టి ఆర్ సర్కిల్, రామవరప్పాడు రింగ్, ఎనికేపాడు 100 రోడ్డు, వారధి
జంక్షన్, డి వి మేనర్ జంక్షన్, బెంజ్
సర్కిల్, గన్నవరం సెంటర్ తదితర ముఖ్య ప్రాంతాలలో
నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగిన వ్యక్తులు నడుపుచున్న లారీ - 1 , టాటా మేజిక్ - 1 , కార్లు - 3
, ఆటో 1 , మోటారు సైకిళ్ళు - 32 మొత్తం గా 38 వాహనాలను
సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డి సి పి నాగరాజు, ట్రాఫిక్ ఏ సి పి లు , ట్రాఫిక్ సి ఐ లు, ఎస్సైలు మరియు వారు సిబ్బంది పాల్గొన్నారు.