యూనిట్

జాతీయ ఓటర్స్ డే ప్రతిజ్ఞ చేసిన విజయవాడ నగర పోలీసులు

జాతీయ ఓటర్స్ డే సందర్బాముగ విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయ ఆవరణలో సిబ్బంది తో నగర అడ్మిన్ డిసిపి ఎస్. హరికృష్ణ ప్రతిజ్ఞ చేయించారు. భారత దేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యం పై విశ్వసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్నినిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేసారు. కార్యక్రమంలో క్రైమ్ డిసిపి డి కోటేశ్వర రావు , ఎడిసిపిలు నవాబ్ జాన్, కెవి శ్రీనివాస రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని