యూనిట్
Flash News
దిశా వాహనాన్ని ప్రారంభించిన విజయనగరం ఎస్పీ
మహిళలు, బాలికలకు సంబందించిన ఫిర్యాదు వచ్చిన వెంటనే తక్షణం స్పందించేందుకు గాను దిశా వాహనాన్ని ఏర్పాటు చేశామని విజయనగరం ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో దిశ వాహనాన్ని శుక్రవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు, బాలికలకు రక్షణగా ఉండడానికి, రాత్రివేళ మహిళ లు గమ్యస్థానాలకు చేర్చేందుకు ఈవాహనా లు ఉపయోగపడతాయన్నారు. ఈ వాహనాన్ని రాత్రి 9 నుంచి ఉద యం 6 గంటల వరకూ అందుబాటులో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ కుమారి.l శ్రీదేవిరావు, డీఎస్పీలు వీరాంజనేయరెడ్డి, సీఎం నాయుడు, ఎల్.మోహనరావు, ఎల్.శేషాద్రి, సీఐలు పాల్గొన్నారు.