యూనిట్

"మీ పల్లెల్లో మీ పోలీస్" ప్రారంభించిన విజయనగరం ఎస్పీ

విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకుమారి సోమవారం విజయనగరం జిల్లా గజపతినగరం మండలం లోని కొత్త బగ్గామ్ గ్రామంలో  "మీ పల్లెల్లో మీ పోలీస్" అనే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ గ్రామంలో రాత్రి సమయం ఉండి అక్కడి ప్రజలకు దిశా చట్టం పై అవగాహన కల్పించారు. ప్రజలు సంఘ వ్యతిరేక శక్తులతో కలవకూడదని సూచించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెల్సుకుని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బొబ్బిలి అదనపు ఎస్పీ కుమారి గౌతమి శాలి, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని