యూనిట్

133 వీథి బాలలను రక్షించిన విజయనగరం జిల్లా పోలీసులు

ఆపరేషన్‌ ‘ముస్కాన్‌’లో భాగంగా విజయనగరం  జిల్లా వ్యాప్తంగా 15  పోలీసుల బృందాలు   133 మంది వీధి బాలలను గుర్తించారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఆపరేషన్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల హక్కులను హరించడం, వారిని కార్మికులుగా వినియోగించే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.   కార్యక్రమంలో డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ సీఎం నాయుడు, ఇన్‌స్పెక్టర్లు డి.శ్రీహరిరాజు, ఎర్రంనాయుడు, ఎస్‌ఐలు అశోక్‌కుమార్‌, హరిబాబు నాయుడు, బాలాజీరావు, కృష్ణ ప్రసాద్‌, బాలల కమిషన్‌ సభ్యులు కేసలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


వార్తావాహిని