యూనిట్
Flash News
ప్రతి పోలీసు స్టేషన్ కు విడియో కాన్ఫరెన్సు కొరకు అత్యాధునిక విడియో కెమెరాలు .....
రాష్ట్ర డిజిపి ఆఫీసు నుండి రాష్ట్రంలోని
ప్రతి ఒక్క పోలీసుస్టేషన్ కు డిఐజి టెక్నికల్ సర్వీస్ జి. పాలరాజు ఆధ్వర్యంలో విడియో కాన్పరెన్స్ విడియో
కెమెరాలను మంజూరు చేశారు. ఈ సంధర్బంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా
ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి అన్ని పోలీసుస్టేషన్ లకు, డిఎస్పీ
ఆఫీసులకు, సర్కిల్ ఇన్ స్పెక్టర్, సబ్
ఇన్ స్పెక్టర్ లకు సంబంధించిన విడియో కాన్ఫరెన్సు విడియో కెమెరాలను పరిశీలించారు. ఈ విడియో
కాన్ఫరెన్సు విడియో కెమెరాల వలన జిల్లాలలోని పోలీసుస్టేషన్ ల నుండి
స్పందన కార్యక్రమం , రాష్ట్ర డిజిపి గారి విడియో కాన్ఫరెన్స్
లను వీక్షించవచ్చన్నారు. అంతేకాకుండా పోలీసుస్టేషన్
అధికారులతో రాష్ట్ర డిజిపి గారు, జిల్లా ఎస్పీ నేరుగా ఈ
విడియో కాన్పరెన్సు పద్దతి ద్వారా మాట్లాడి అక్కడి విషయాలను తెలుసుకొనుటకు
వీలుంటుందన్నారు.