యూనిట్

గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి నెల్లూరు పర్యటన

రెండు రోజులు పాటు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి వెంకటాచలం రైల్వేస్టేషన్ వద్ద జిల్లా యస్.పి. శ్రీ భాస్కర్ భూషణ్, IPS., గారు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలకడం జరిగింది.

ది 20.01.2020 ఉదయం 8 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక రైల్ లో బయలు దేరి ఉదయం 11 గంటలకు వెంకటాచలం స్టేషన్ కు చేరుకొన్న గౌరవ ఉపరాష్ట్రపతి గారికి జిల్లా అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి VVIP కాన్వాయి స్వర్ణభారతి ట్రస్ట్ కు చేరగా గౌరవ ఉపరాష్ట్రపతి గారికి పోలీసు గౌరవ వందన (గార్డ్ ఆఫ్ హానర్) లాంచనాలతో స్వాగతం పలికారు. మధ్యాహ్నం నుండి సరస్వతి నగర్ లోని ప్రజామందిరంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలుగు భాషాభిమానులతో ఏర్పాటు చేయబడ్డ కార్యగోష్టిలో మొదలగు కార్యక్రమాలలో పాల్గొని, తదుపరి అక్కడే ఏర్పాటు చేయబడిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. రాత్రికి స్వర్ణ భారతి ట్రస్ట్ లో బస చేయనున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా మొదటి రోజు పోలీసు బందోబస్త్ ప్రశాంతంగా కొనసాగినది. రేపటి పర్యటన దృష్టిలో పెట్టుకొని జిల్లా యస్.పి. గారు అధికారులకు మరియు స్పెషల్ పార్టీలకు  ఏరియా డామినేషన్ కంటిన్యూగా జరగాలని, కల్వర్ట్ చెకింగ్, బాంబ్ మరియు డాగ్ స్క్వాడ్ లతో యాంటీ సబోటేజ్ చెకింగ్, ఆర్.ఒ.పి., కూంబింగ్ లు క్షుణ్ణంగా నిర్వహించాలని, వి.వి.ఐ.పి. బస చేసే ప్రదేశంను వంద శాతం స్టెరైల్ చెయ్యాలని క్యాంప్ కమాండెంట్, అధికారులకు, స్పెషల్ పార్టీలకు ఆదేశాలు జారీచేసారు.

వార్తావాహిని