యూనిట్

పశ్చిమ గోదావరి పోలీసు శిక్షణా కేంద్రంలో వనం-మనం

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ ఎం ఆర్‌ సి కాలనీ వద్ద ఉన్న పోలీస్‌ శిక్షణ కేంద్రంను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా వనం మనం కార్యక్రమం నిర్వహించి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకొని నాటడమే కాకుండా, వాటిని ఎదిగేలా రక్షణ చేయాలని ఎస్పీ ఆదేశించారు. దీనిలో భాగంగా జిల్లాలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మొక్కలు నాటి వాటి సంరక్షణా బాధ్యతలు చేపట్టవలసినదిగా సిబ్బందికి ఆదేశించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మొక్కల పెంపకం సరైన మార్గం అన్నారు. ఈ కార్యక్రమం లో జవహర్‌ నవోదయ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్‌ శిక్షణా కేంద్రంలో ఉన్న ఈ-లెర్నింగ్‌ సెంటర్‌ను పరిశీలించి ప్రస్తుతం సిబ్బందికి ఇస్తున్న కోర్స్‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. సైబర్‌ నేరాలకు సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీని సిబ్బందికి శిక్షణ అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి డిటిసి ప్రిన్సిపల్‌, అడిషనల్‌ ఎస్పీ కే. ఈశ్వరరావు, అడిషనల్‌ ఎస్పీ ఎం. మహేష్‌ కుమార్‌, డిఎస్‌పి ఎన్‌. మురళీకష్ణ, ఎం. వెంకటేశ్వర రావు, సిఐలు సి.హెచ్‌. రామారావు, వై.వి.వి.ఎల్‌. నాయుడు, ఎస్‌.ఐ. బి.మోహన రావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని