యూనిట్
Flash News
ద్విచక్రవాహన దొంగలు అరెస్టు

ద్విచక్రవాహన
దొంగలు అరెస్టు విశాఖపట్నంలో వరుస ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ముగ్గురు
సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ ఆర్.కె.మీనా తెలిపారు.
నిందితులు వెలగ వీరయ్య చౌదరి, రాజాన
నాగేశ్వర రావు మరియు డొక్కినపల్లి బాబి ముగ్గురు కలిసి నగరంలో 130 ద్విచక్రవాహనాలను దొంగలించినట్లు వెల్లడించారు. నిందితులు ముగ్గురుని
అరెస్టు చేసి వారి వద్ద నుండి 130 ద్విచక్రవాహనాలు, 5 ఇంజన్లు, రూ.90 వేల రూపాయల
నగదు, రూ.5,01,000/- విలువ చేసే భూమి
ధ్రువ పత్రాలు, 30 బాక్సుల వివిధ మోటార్ సైకిల్‌ల విడిభాగాలు,
తప్పుడు నెంబర్ ప్లేట్స్, ఫేక్ కీలు
స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేయడంలో ఎంతో కీలకంగా
వ్యవహరించిన సి.ఐలు పి.సూర్యనారాయణ, ఎం.అవతారం, ఎస్సైలు బి.రమణయ్య, జి.తేజేశ్వర రావు, జి.సంతోష్, జి.వెంకట రావు మరియు ఇతర అధికారులను
కమీషనర్ అభినందించారు.